Joe Biden : రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న బిడెన్..?
యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ రెండవసారి అధ్యక్ష బరిలో నిలవనున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదె. తాను అధ్యక్ష
- Author : Prasad
Date : 11-04-2023 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ రెండవసారి అధ్యక్ష బరిలో నిలవనున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదె. తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నానని.., కానీ ఇంకా దానిని ప్రకటించడానికి సిద్ధంగా లేమని.. బిడెన్ సోమవారం ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బిడెన్ తాను రెండవసార అధ్యక్షపదవికి పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే తన కుటుంబాన్ని సంప్రదించిన తర్వాతే ప్రకటిస్తానని చెప్పారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ తన సొంత పార్టీ సభ్యులతో సహా అతని వయస్సు గురించిన ప్రశ్నలను ధిక్కరిస్తూ.. US అధ్యక్షుడు రెండవసారి పోటీ చేస్తారనే సూచనలు ఉన్నాయి. బిడెన్ వయస్సు 80 సంవత్సరాలు…బిడెన్ గెలిస్తే 2025లో రెండో టర్మ్ ప్రారంభమయ్యే నాటికి అతని వయసు 82 అవుతుంది. ప్రెసిడెంట్ బిడెన్ ప్రస్తుతం 538 మొత్తం పోల్స్‌లో 42.6 శాతం ఆమోదం రేటింగ్‌తో 52.6 శాతం అసమ్మతి రేటింగ్‌తో ఉన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పుడు.. నిరుద్యోగం తక్కువగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది.