Sub Zero Temperatures : చైనాకు చలి దడ.. మైనస్ డిగ్రీ టెంపరేచర్స్‌తో వణుకు
Sub Zero Temperatures : టెంపరేచర్ 10 డిగ్రీలు తగ్గిపోతేనే మనం ఒక రేంజులో వణికిపోతాం. గడ్డకట్టుకుపోతాం!!
- By Pasha Published Date - 09:28 AM, Mon - 25 December 23

Sub Zero Temperatures : టెంపరేచర్ 10 డిగ్రీలు తగ్గిపోతేనే మనం ఒక రేంజులో వణికిపోతాం. గడ్డకట్టుకుపోతాం!! అలాంటిది ఈనెలలో చైనా రాజధాని బీజింగ్‌లో మైనస్ డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. డిసెంబరు 11 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 360 గంటలుగా బీజింగ్‌లో సబ్ జీరో టెంపరేచరే నమోదు అవుతోంది. చివరిసారిగా 1951 సంవత్సరం డిసెంబరులో బీజింగ్‌లో ఇంత దారుణమైన టెంపరేచర్స్ నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు అదే రేంజ్‌లో చైనా రాజధానిని చలి వణికిస్తోంది. గత తొమ్మిది రోజులలో బీజింగ్‌లో సగటున మైనస్ 10 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ నమోదవుతోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని పుయాంగ్, పింగ్‌డింగ్‌షాన్ నగరాల్లో మైనస్ రేంజ్‌లోనే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. చైనాలోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు పడిపోయింది. యావత్ చైనాను కూడా ఇప్పుడు చలి వణికిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా హీటర్ల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పవర్ ప్లాంట్లు వాటి పూర్తి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. ఈక్రమంలో చైనా సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్‌లో పలు పవర్ ప్లాంట్లు ఫెయిల్ కూడా అయ్యాయి. ఈనేపథ్యంలో హెనాన్ ప్రావిన్స్‌లోని ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాల్లో మాత్రమే హీటర్ల వినియోగానికి అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీల్లో హీటర్ల వినియోగాన్ని ఆపేశారు.
We’re now on WhatsApp. Click to Join.
చైనా పొరుగున ఉన్న తైవాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం తైవాన్‌లోని టైటుంగ్ కౌంటీకి సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ బ్యూరో పేర్కొంది. తైవాన్ రాజధాని తైపీలో మాత్రం భూకంపం రాలేదు. అంతకుముందు మన ఇండియాలోని మేఘాలయ ప్రాంతంలోనూ శనివారం రాత్రి భూకంపం సంభవించింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ రీజియన్ లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. ఈ భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వారు బయట రోడ్లపైకి పరుగులు తీశారు.
Also Read: Onions Santa : ఉల్లిపాయలతో ప్రపంచంలోనే పెద్ద శాంతాక్లాజ్
https://twitter.com/liv59224/status/1738928140485788082?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1738928140485788082%7Ctwgr%5E2d37d8ff461cd73ecf63fe79fc0af36cf8e72c15%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnews%2Fchina-snow-storm-minus-40-degree-temperature-china-longest-cold-wave-in-72-years-508761.html