Pakistan : దారుణం..పాకిస్తాన్ లో అహ్మదీయ జనాభాను అరికట్టేందుకు గర్భిణీలపై దాడులు!!
పాకిస్థాన్‌లో మైనారిటీలపై క్రూరత్వం ఆగడం లేదు.
- Author : hashtagu
Date : 09-10-2022 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
పాకిస్థాన్‌లో మైనారిటీలపై క్రూరత్వం ఆగడం లేదు. ఒక తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) మతాధికారి తన అనుచరులకు అహ్మదీయ కమ్యూనిటీకి చెందిన గర్భిణీలపై దాడి చేయమని ఆదేశించాడు. ఇలా చేస్తే అహ్మదీయులు సంఖ్య తగ్గిపోతుంది. మతపరమైన ఉదారవాదం, మానవ హక్కుల మ్యాగజైన్ బిట్టర్ వింటర్ నివేదిక ప్రకారం.. TLP మతాధికారి మొహమ్మద్ నయీమ్ చాతా ఖాద్రీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దూషించేవారికి తల నరికివేయడమే శిక్ష అని వీడియోలో చెప్పాడు. దాడి విజయవంతం కాకపోతే, పుట్టబోయే పిల్లలను చంపాలని ఆయన మద్దతుదారులకు తెలిపారు. దీంతో పాటు, అహ్మదీల నిర్మూలన సమయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని ఖాద్రీ పోలీసులను హెచ్చరించారు.