American fighter jet: నింగి నుంచి నేలకొరిగిన అమెరికా ఫైటర్ జెట్!
- By Anshu Published Date - 10:19 PM, Fri - 16 December 22

ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధ విమానాలతో ఫైటర్ జెట్ లతో పోల్చుకుంటే అమెరికా కి సంబంధించినవి అగ్రగామి అని చెప్పవచ్చు. ఒకరకంగా ప్రపంచాన్ని శాసించే సత్తా అమెరికాకు రావడానికి క్యాపిటలిజం తో పాటు అమెరికన్ మిలట్రీ అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి అమెరికాలోని అనూహ్యంగా ఫైటర్ జెట్ ప్రమాదానికి గురికావడం ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది.
అమెరికాకు చెందిన ఫైటర్ జడ్ రన్వే మీద కుప్పకూలింది. ఆఖరి నిమిషంలో జెట్ లో నుంచి బయటపడ్డ పైలట్ ఎంతో చాకచక్యంగా తన ప్రాణాలను దక్కించుకోగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే అమెరికా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎఫ్ 35 బీ ఫైటర్ జెట్ ల్యాండ్ అవ్వబోతూ నేలకొరిగింది. సక్సెస్ లోని ఎయిర్ స్టేషన్ లో ఈ దుర్ఘటన సంభవించింది.
దీనికి సంబంధించి సోషల్ మీడియా లో విడుదలైన వీడియోలో ప్లేన్ లాండింగ్ అయ్యే సమయంలో నెమ్మదిగా కదలడం గమనించవచ్చు. పైలెట్ ఈ జెట్ ను హెలికాప్టర్ లాగా మెల్లిగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ వీల్స్ నేలను టచ్ అయ్యే సమయానికి జెట్ పూర్తిగా అదుపు తప్పింది. పైలట్ ఎంత ప్రయత్నించినప్పటికీ జెట్ ను కంట్రోల్ చేయడం అతనికి సాధ్యపడలేదు. జెట్ ముందు భాగం నేలను ఢీ కొట్టింది. ఇక చేసేది లేక ప్రాణాలు కాపాడుకోవడానికి పారాషూట్ సహాయంతో అతను ఆ జెట్ నుంచి బయటకు దూకాడు. అక్కడ ఎయిర్ స్టేషన్లో ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు.
వెంటనే ఈ సీన్ మొత్తం సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. దాన్ని నెటిజన్స్ బాగా పాపులర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రన్వే వద్దకు పుటాహుటిన చేరుకొని అది పేలకుండా చర్యలు చేపట్టారు. అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంపై పూర్తిగా దర్యాప్తు జరుపుతామని అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.