Brine Shrimp: రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు
సీ ఫుడ్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారపదార్దాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
- Author : Praveen Aluthuru
Date : 24-12-2023 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Brine Shrimp: సీ ఫుడ్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారపదార్దాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రొయ్యలు తినడం ద్వారా గుండె బలపడుతుంది. అందులో ఉన్న పోషకాలు మేలు చేస్తాయి. రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడుతుంది.కాగా రొయ్యలు మాత్రమే లభించే ఒక సరస్సు గురించి తెలుసుకుందాం.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సరస్సు. ఇది ఏ సముద్రంలో కనిపించదు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. అత్యంత లవణీయత కలిగిన ఈ సరస్సులో సాధారణ జలచరాలు ఏవీ జీవించలేవు. అందులో చేపలు, పీతలు కనిపించవు. అయితే ఈ సరస్సులో ‘బ్రెయిన్‌ష్రిమ్ప్’ అనే ఒక రకమైన రొయ్యలు పుష్కలంగా లభిస్తాయి.
లక్షలాది పక్షులు ఈ సరస్సుకు ఆహారం కోసం ప్రతి సీజన్‌లో వలస వస్తుంటాయి. ఈ సరస్సు సుమారు 7.60 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ అద్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా ప్రభుత్వం సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి మంచినీటిని విడుదల చేసింది. దీంతో ‘బ్రెయిన్ ష్రింప్’ రొయ్యల సంఖ్య తగ్గిపోయి వలస పక్షుల రాక కూడా తగ్గింది. దీంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించి దానిని సహజ స్థితికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్