Small Plane Crashes : అమెరికా ఒహాయోలో కుప్పకూలిన విమానం
Small Plane Crashes : యంగ్స్‌టౌన్-వారెన్ (Youngstown) ప్రాంతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన సెస్నా 441 చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది
- By Sudheer Published Date - 10:33 PM, Mon - 30 June 25

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని (Small Plane Crashes) కలిగించింది. యంగ్స్‌టౌన్-వారెన్ (Youngstown) ప్రాంతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన సెస్నా 441 చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. గాల్లోకి ఎగిరిన వెంటనే నియంత్రణ కోల్పోయిన ఈ విమానం హౌలాండ్ టౌన్‌షిప్ సమీపంలో కూలినట్లు అధికారులు తెలిపారు.
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే విమానం కూలిన ప్రదేశం అతి క్లిష్టమైన ప్రాంతంగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రంబుల్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి మృతదేహాలను తరలించినట్లు అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ డైరెక్టర్ ఆంతోనీ ట్రెవెనా తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) కలిసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నాయని వెల్లడించారు. మృతుల వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమాన ప్రయాణాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. బాధిత కుటుంబాలకు సహానుభూతి వ్యక్తం చేస్తూ అమెరికా జనతా తీవ్ర దిగ్బ్రాంతి చెందుతోంది.