HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Youths Going To Goa Should Be Careful

Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

Goa Tour : తాత్కాలిక వసతి కోసం ఎంచుకునే హోటళ్లు లేదా అపార్ట్‌మెంట్లలో రహస్య కెమెరాలు లేదా రికార్డింగ్ పరికరాలు అమర్చి ఉండవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని హెచ్చరించారు

  • Author : Sudheer Date : 07-12-2025 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Goa Tour
Goa Tour

ఆహ్లాదం కోసం గోవా పర్యటనకు వెళ్లాలని భావించే ప్రేమ జంటలు, ముఖ్యంగా తాత్కాలిక ప్రైవేట్ అకామిడేషన్ ఎంచుకునే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాజా ఘటన తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక బ్లాక్‌మెయిల్ ఉదంతం పర్యటకులను, ముఖ్యంగా ప్రేమ జంటలను షాక్‌కి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన 35 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి గోవాకు పర్యటనకు వెళ్లగా, అక్కడ వారి ప్రయాణ ఏర్పాట్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్ల నిర్వహణ బాధ్యతలు చూసే యశ్వంత్ అనే వ్యక్తి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. గోవా ట్రిప్‌లో ఆ మహిళ తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోలు మరియు ఫోటోలను రహస్యంగా రికార్డు చేశానని బెదిరిస్తూ, ఆమెకు ఊహించని ఫోన్ కాల్ చేశాడు. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె భర్తకు పంపుతానని యశ్వంత్ హెచ్చరించాడు.

Minister Lokesh Dallas Tour : డల్లాస్ వేదికగా జగన్ పరువు తీసిన లోకేష్

ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు మహిళ, తన వైవాహిక జీవితం నాశనం అవుతుందని అతడిని బతిమిలాడింది. డబ్బులు అడగవద్దని ప్రాధేయపడినా, ఆ వ్యక్తి తన బెదిరింపులను ఆపలేదు. తనను విడిచిపెట్టాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ మహిళపై మరింత ఒత్తిడి పెంచాడు. దీంతో బాధితురాలు చేసేదేమీ లేక సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన సదరు వ్యక్తిపై బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సనత్ నగర్ పోలీసులు ప్రస్తుతం ఈ గోవా ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను, నిందితుడి ఆచూకీని సేకరిస్తున్నారు.

Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్

తాజా ఉదంతం నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే జంటలకు పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గోవా లేదా ఇతర పర్యాటక ప్రాంతాలలో ప్రైవేట్ బస ఎంపికలు చేసుకునేటప్పుడు, వ్యక్తిగత గోప్యత (Privacy) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాత్కాలిక వసతి కోసం ఎంచుకునే హోటళ్లు లేదా అపార్ట్‌మెంట్లలో రహస్య కెమెరాలు లేదా రికార్డింగ్ పరికరాలు అమర్చి ఉండవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని హెచ్చరించారు. కేవలం ఎంజాయ్ చేయాలన్న ధ్యాసలో ఉండి, మిమ్మల్ని గమనించి, మీ వ్యక్తిగత క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తులు ఉంటారన్న విషయాన్ని పర్యాటక జంటలు ఇకనైనా గుర్తించాలి. తమ పర్యటన సంతోషంగా ముగియాలంటే, అపరిచితులను నమ్మకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రతి అంశం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన సూచిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Be Careful
  • Blackmail Phone Calls
  • Goa Tour
  • lovers goa tour
  • youth

Related News

    Latest News

    • Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇక‌పై అలా చేస్తే!!

    • Maruti Suzuki Car: మారుతి సెలెరియో ఎందుకు బెస్ట్ బడ్జెట్ కారు అవుతుంది?!

    • Retro Walking: రెట్రో వాకింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?!

    • Rithu Chowdary: రీతూ చౌదరి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • CM Revanth Reddy: తెలంగాణ ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు: సీఎం రేవంత్

    Trending News

      • Top Google Searches: గూగుల్ సెర్చ్ 2025.. భారత్‌లో వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్‌లో అభిషేక్ శర్మ హవా!

      • JioHotstar: జియోహాట్‌స్టార్ నుండి ఐసీసీకి భారీ షాక్!

      • CM Revanth Reddy: 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

      • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

      • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd