Viral news : ఉదయం లేవగానే పెట్రోల్ తాగాలి… తప్పనిసరి… వింత వ్యాధితో యువతి
కొన్ని కొన్ని విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది నిజమేనా.. ఇలా చేస్తే ఎలా అనే ప్రశ్నలు మన మదిలో మెదులుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చదువబోతున్న వార్తా కూడా అలాంటిదే.. విషయానికి వస్తే.. ఉదయం లేవగానే మద్యం తాగకుంటే చేతులు కాళ్లు వణికే వారిని చూసేఉంటారు.. అయితే... చాలా మందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి.
- By Kavya Krishna Published Date - 02:31 PM, Tue - 9 July 24

కొన్ని కొన్ని విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది నిజమేనా.. ఇలా చేస్తే ఎలా అనే ప్రశ్నలు మన మదిలో మెదులుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చదువబోతున్న వార్తా కూడా అలాంటిదే.. విషయానికి వస్తే.. ఉదయం లేవగానే మద్యం తాగకుంటే చేతులు కాళ్లు వణికే వారిని చూసేఉంటారు.. అయితే… చాలా మందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అయితే పొద్దున్నే పెట్రోలు తాగకపోతే డిప్రెషన్, ఆశాంతికిలోనైన వారిని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రపంచంలో చాలా మంది అనేక రకాలుగా బానిసలుగా ఉన్నారు. ఒంటారియోలోని వెల్లండ్ కు చెందిన షానన్ అనే యువతి పెట్రోల్ కు బానిసైంది. రోజూ ఉదయం నిద్ర లేవగానే ముందుగా పెట్రోల్ తాగడం ఆమెకు అలవాటు.
We’re now on WhatsApp. Click to Join.
ఇందుకోసం బాత్‌రూమ్‌లో పెట్రోల్ డబ్బాలు నిల్వ ఉంచుకుంటోంది షానన్. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించానని.. కానీ కుదరలేదని యువతి చెబుతోంది. వాంతులు , తీవ్రమైన కడుపు నొప్పి కాకుండా, పెట్రోల్ తాగడం వల్ల మన అంతర్గత అవయవాలు కూడా దెబ్బతింటాయి. తెలియకుండా పెట్రోల్ మన శరీరం లోపలికి వచ్చినా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెబుతుంటారు.
అయితే.. ఆ పరిస్థితిలోనే షానన్ అనే యువతి ఈ అలవాటును అనుసరిస్తోంది. ఇది సురక్షితం కాదని తెలిసింది. ఇది నన్ను చంపుతోంది, కానీ నేను దానిని ఆపలేను, అని మహిళ చెప్పింది. షానన్ కూడా గ్యాసోలిన్ సేవించినప్పుడు సాస్ లాగా రుచి చూస్తుంది. ఆమె గొంతు లోపలి భాగం మండుతున్నట్లు అనిపించింది. బయటకు వెళ్లినప్పుడు కూడా ఈ అలవాటును వదులుకోలేనని, తాగేందుకు వాటర్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్తానని కూడా ఆ మహిళ చెబుతోంది. ఈ అలవాటు మొదలై దాదాపు ఏడాది కావస్తోందని షానన్ పేర్కొంది.
తాను రోజుకు 12 టీస్పూన్ల వరకు పెట్రోల్ తాగేదానినని కూడా చెప్పింది. షానన్ తనకు చిన్నతనంలో పెట్రోల్ వాసన అంటే ఇష్టమని, అలా తాగేదానినని వివరించింది షానణ్. ఆమె డిప్రెషన్ నుండి తప్పించుకోవడానికి కూడా అలవాటు దోహదపడుతుందని, ఆమె పెట్రోల్‌కు బానిస కావడానికి మరో కారణమని చెప్పింది. ఈ అలవాటు వల్ల ఇప్పటికే కడుపునొప్పి, ఛాతీ నొప్పితో పాటు పలు రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. షానన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
Read Also : Narendra Modi : పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ