Wife Kills Husband : కోర్ట్ , పోలీసులకు భయపడని ఆడవారు..స్కెచ్ వేసి మరి భర్తలను చంపుతున్నారు
Wife Kills Husband : తమిళనాడులోని వేలూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36), బెంగళూరుకు చెందిన నందిని (26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది
- By Sudheer Published Date - 01:14 PM, Thu - 24 July 25

దేశంలో రోజు రోజుకు మహిళల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను , కన్న బిడ్డలను చంపుతున్నారు. ఓ పక్క ఇలాంటి నేరాలకు పాల్పడిన ఆడవారికి కోర్ట్ లు , పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా నేరాలు చేస్తున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ఇలాంటి నేరాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఆడవారు నదిలో పడేసి చెపుతున్నారు..మరికొంతమంది తినే ఆహారంలో విషం పెట్టి చంపుతున్నారు. ఇంకొంతమంది చంపేసి ఇంట్లోనే పాతిపెడుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని వేలూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36), బెంగళూరుకు చెందిన నందిని (26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న భారత్ వారంలో ఒక్కరోజు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఈ సమయంలో భార్య నందిని ఎదురింటి యువకుడు సంజయ్ (21)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది.
Anil Ambani: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు: 35 ప్రాంతాల్లో దాడులు
భారత్‌కు ఈ విషయం తెలిసిన తరువాత నందినిని పద్దతి మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. అయినా ఆమె తన ప్రవర్తనను మార్చుకోకపోవడంతో, ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని పథకం వేసింది. జూలై 21న భారత్ తన భార్య నందిని, చిన్న కూతురిని బైక్‌పై తీసుకొని సరకుల కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా నందినితో ముందుగా ప్లాన్ చేసినట్టుగా సంజయ్‌ను రోడ్డుపక్కనే పొదలో దాక్కోమని తెలిపింది. వారంతా తిరిగి ఇంటికొస్తుండగా, రోడ్డుపై ఉన్న కొబ్బరిమట్టలపై బైక్ తాకిన కారణంగా వారు కిందపడ్డారు. అదే సమయంలో పొదలో దాక్కున్న సంజయ్ ఒక్కసారిగా బయటకు వచ్చి, భారత్‌ను కత్తితో పొడిచి అక్కడే హత్య చేశాడు. ఘటన అనంతరం సంజయ్ అక్కడినుంచి పరారయ్యాడు. మొదట నందిని ఇచ్చిన సమాచారం అనుమానంగా అనిపించడంతో, ఆమెను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది.
దీంతో పోలీసులు నందిని మూడేళ్ల కుమార్తెను ప్రశ్నించగా, ఆమె చెప్పిన వ్యాఖ్యలతో అసలు కుట్ర బయటపడింది. తన తల్లి, ఎదురింటి అన్నయ్య కలిసి తండ్రిని చంపారని మూడేళ్ల చిన్నారి చెప్పడంతో పోలీసులు చలించిపోయారు. వెంటనే సంజయ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.