Delhi Girl: ఇది మీ ఇల్లు కాదు.. మెట్రో రైలు, చక్కర్లు కొడుతున్న యువతి వీడియో!
ఢిల్లీ మెట్రోలో అనేక చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి వీడియో వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 05:52 PM, Mon - 19 June 23

ఢిల్లీ మెట్రోలో అనేక చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ప్రేమికులు మెట్రో ట్రైన్ లోనే రొమాన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు ఇద్దరు యువతులు మెట్రో రైలులో కొట్టుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే రెండు ఘటనలు మరిచిపోకముందే తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్కిల్ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగించడం చూడొచ్చు. ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకుంటుంది. కానీ, సాటి ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన పని తాను చేసుకుంటు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే 1.60 లక్షల లైక్ లు వచ్చాయి. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ఇది మెట్రో.. మీ ఇల్లు కాదు అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో ఘటనలు హాట్ టాపిక్ మారడంతో పాటు వివాదస్పదమవుతున్నాయి.
https://twitter.com/HasnaZarooriHai/status/1670119257215238145?cxt=HHwWgoDUrbSnuq0uAAAA
Also Read: Strongest Beer: ఈ బీర్ చాలా డేంజర్ గురూ, ఒకేసారి తాగితే ఇక అంతే మరి!