Muslim MLA: ముస్లిం ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించిందని గంగాజలంతో శుద్ధి
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యే సందర్శించిన తర్వాత ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దూమరియాగంజ్ ఎమ్మెల్యే సయీదా ఖాతూన్
- By Praveen Aluthuru Published Date - 08:16 PM, Tue - 28 November 23
Muslim MLA: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యే సందర్శించిన తర్వాత ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దూమరియాగంజ్ ఎమ్మెల్యే సయీదా ఖాతూన్ స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు షట్చండీ మహాయజ్ఞలో పాల్గొనేందుకు సమయ మాత ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఆమె వెళ్లిన తర్వాత కొందరు మంత్రోచ్ఛారణల మధ్య గంగాజలంతో శుద్ధి చేశారు. ఆలయం ఉన్న బధాని చాఫా నగర పంచాయతీ చీఫ్ ధరమ్‌రాజ్ వర్మ నేతృత్వంలో శుద్ధి చేశారు. ఈ శుద్ధి తరువాత ఈ ప్రదేశం ఇప్పుడు పూర్తిగా పవిత్రంగా మరియు పూజలకు అనుకూలంగా మారిందని స్థానిక ప్రజలు చెప్తుడటం గమనార్హం. అయితే తాను ప్రజాప్రతినిధిగా అన్ని మతాలు, వర్గాలకు సంబంధించిన ప్రదేశాలను సందర్శిస్తూనే ఉంటానని, అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయబోనని సయీదా ఖాతూన్ చెప్పారు.నేను అన్ని మతాలను గౌరవిస్తాను, నేను ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ఎమ్మెల్యేని మరియు నన్ను ఆహ్వానించిన ప్రతిచోటా వెళ్తాను అన్నారు.
Also Read: Stomach Pain Remedies: కడుపు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి..!