Wall Paint With Sandals : చెప్పులు, చీపుర్లతో వాల్ పెయింటింగ్.. ఇదిగో వీడియో
Wall Paint With Sandals : బ్రష్‌తో వాల్ పెయింటింగ్ వేయడం గురించి మనకు బాగా తెలుసు.
- Author : Pasha
Date : 30-12-2023 - 2:54 IST
Published By : Hashtagu Telugu Desk
Wall Paint With Sandals : బ్రష్‌తో వాల్ పెయింటింగ్ వేయడం గురించి మనకు బాగా తెలుసు. కానీ అలెక్స్ అనే యువతి కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్న విధంగా క్రియేటివిటీని చాటుకుంది. చెప్పులు, బూజు దులిపే కర్ర, చీపురు, పిల్లల ఆటబొమ్మలు సహా ఇంట్లోని వివిధ వస్తువులతో చక్కటి పెయింటింగ్ వేసింది. దీనికి సంబంధించి ఆమె తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇలాంటి వస్తువులతో ఆమె గీసిన వాల్ పెయింటులోనూ జీవకళ ఉట్టిపడింది. అది ఎంతో కలర్ ఫుల్‌గా కనిపించింది.
We’re now on WhatsApp. Click to Join.
గోడే క్యాన్వాస్.. ఇంట్లో వస్తువులే బ్రష్‌లుగా చేసుకొని అలెక్స్ క్రియేట్ చేసిన వాల్ పెయింటింగ్ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. అందరి మన్ననలు అందుకుంటోంది. క్రియేటివిటీ ఉండాలే కానీ.. వేటినైనా వాడుకొని చక్కటి పెయింటింగ్‌ను క్రియేట్ చేయొచ్చని ఈ యువతి నిరూపించిందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈమె వాల్ పెయింటింగ్ వర్క్ అంతా పూర్తయ్యాక గోడపై ప్రత్యక్షమైన సీన్ ఏదో తెలుసా ? సింహం ముఖం !! ఈ మొత్తం పెయింట్ వర్క్‌కు అలెక్స్ చక్కటి పేరు కూడా పెట్టింది. అదేమిటంటే.. ‘సైకిల్ ఆఫ్ లైఫ్’ !! ‘‘ప్రతిభను ఎవరూ ఆపలేరని అలెక్స్ నిరూపించింది’’ అని కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. ‘‘క్రియేటివిటీకి హద్దులు లేవు.. దాన్ని ఏ వనరుల కొరత కూడా ఆపలేదు అని నిరూపితమైంది’’ అని ఇంకో నెటిజన్(Wall Paint With Sandals) చెప్పాడు.