Holi : హోలీ వచ్చిందంటే..ఆ గ్రామంలో మగవారు చీరలు కట్టుకోవాల్సిందే
Holi : పురుషులు హోలీ రోజున స్త్రీల వేషధారణలో కనిపించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది
- By Sudheer Published Date - 04:26 PM, Fri - 14 March 25

హోలీ పండుగ వచ్చిందంటే రంగుల ఉత్సాహం, ఆనందం నిండిన వేళ. అయితే కర్నూలు (Kurnool) జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామం(Santhekudlur Village)లో హోలీ (Holi) పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో పురుషులు హోలీ రోజున స్త్రీల వేషధారణలో కనిపించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. పురుషులు చీరలు కట్టుకుని, స్త్రీలలా ముస్తాబై గ్రామంలోని మన్మథస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం. ఈ ఆచారం తరతరాలుగా పాటించబడుతూ వస్తోంది.
Delhi Capitals: గత 17 ఏళ్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్!
గ్రామస్థుల నమ్మకం ప్రకారం.. హోలీ రోజున ఈ వేషధారణలో మన్మథస్వామిని దర్శిస్తే శుభం జరుగుతుందని, వారి కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. పురుషులు స్త్రీల వేషధారణలో ఉత్సాహంగా పూజల్లో పాల్గొంటారు. ఆలయ పరిసరాలు రంగుల హోళితో నిండిపోతాయి. వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించి, సంతోషంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు.
Janasena : ‘జయకేతనం’..సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు
ఈ వింత ఆచారాన్ని చూడటానికి తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ ప్రత్యేక సంప్రదాయం సంతేకుడ్లూరు గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది. హోలీ పండుగ సందర్బంగా ఇక్కడి ప్రజలు అనుసరించే ఈ ఆచారం, భక్తి, ఆనందం కలబోసిన అరుదైన సంప్రదాయంగా మారింది.