Wolf: రూ. 20 లక్షలు ఖర్చు చేసి మరీ తోడేలుగా మారిపోయిన ఇంజనీర్.?
మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో అనేక రకాల కలలు కంటూ ఉంటారు. సాకారం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొందరు వారి వ
- By Anshu Published Date - 03:40 PM, Tue - 1 August 23

మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో అనేక రకాల కలలు కంటూ ఉంటారు. సాకారం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొందరు వారి వ్యక్తిగత కారణాల ఆ కలలను నిజం చేసుకోలేకపోతూ ఉంటారు. ఒక ఇంజనీర్ తన చిన్న నాటి కల అటువంటిదే. కానీ ఎట్టకేలకు ఆ ఇంజనీర్ తన కలను నెరవేర్చుకున్నారు. అందుకు అతడు దాదాపుగా రూ. 20 లక్షలు ఖర్చు చేశాడు. జపాన్‌కు చెందిన 32 ఏళ్ల ఇంజనీర్ చిన్నప్పటి నుండి జంతువుగా మారాలని కోరుకున్నాడు. ఇప్పుడు తోడేలు కాస్ట్యూమ్ రెడీ చేసుకున్నాడు. అది వేసుకున్నాక కష్టాలన్నీ మర్చిపోతానని అంటున్నాడు.
ఇటీవల కాలంలో అదే జపాన్‌లో ఒక వ్యక్తి కుక్క కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ కల కోసం రూ.12 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి అతని కంటే రెండడుగులు ముందుకు వేశాడు. జపాన్ యువకుడి కల తోడేలుగా మారడం. ఎట్టకేలకు అతని కల నెరవేరింది. 20 లక్షలు వెచ్చించి వేసుకున్న తర్వాత సరిగ్గా తోడేలులా కనిపించేలా కాస్ట్యూమ్‌ని సిద్ధం చేసుకున్నాడు. విచిత్రమైన అభిరుచి ఉన్న వ్యక్తి పేరు తోరు ఉడ. అతను వృత్తిరీత్యా ఇంజనీర్. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను తన అభిమాన సూట్‌ను పొందాడు. దానిని ధరించి ఫోటోషూట్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సినిమా, టీవీ పరిశ్రమకు కాస్ట్యూమ్‌లను అందించే మోడలింగ్ కంపెనీ అయిన జెపెట్ వర్క్‌షాప్ దీనిని రూపొందించింది. 32 ఏళ్ల ఇంజనీర్ ఇంట్లో కూడా ఈ సూట్ ధరించడం సౌకర్యంగా ఉందని చెప్పారు. తోడేలుగా మారిన తర్వాత కష్టాలన్నీ మరిచిపోయానని అతను అన్నారు. యూకే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత తాను మనిషిని కానని అనిపిస్తోంది. మానవ సంబంధాలు, కష్టాలు, పని ఒత్తిడి అన్నీ మర్చిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సూట్ వేసుకున్నాక మంచి అనుభూతిని పొందుతున్నాను. స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. అద్దంలో చూసుకుంటే తోడేలులా కనిపిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నాడు. తాను ప్రమాదకరమైన తోడేలుగా మారను. తాను ఆకతాయిని కాదన్నాడు. సూట్ వేసుకున్న తర్వాత కదలడానికి కూడా సౌకర్యంగా ఉందన్నాడు. .