Spider in Ear : మహిళ చెవిలో సాలీడు పురుగులను చూసి ఖంగుతిన్న డాక్టర్స్
కొద్దీ రోజులుగా ఓ మహిళ చెవి దురద తో తెగ ఇబ్బంది పడుతుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు చెవిలో వింత సౌండ్స్ కూడా వస్తుండడం తో ఇంట్లోనే కొన్ని చిట్కాలను వాడింది
- By Sudheer Published Date - 03:56 PM, Sat - 28 October 23

అప్పుడప్పుడు డాక్టర్స్ కు షాకింగ్ ఘటనలు ఎదురువుతాయి. కడుపులో కత్తెర్లు , పినిసులు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తుంటారు. మరికొంతమందైతే వెంట్రుకలు, ఇనుప వస్తువులు తదితరాలు వాటిని మింగేసి వస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఏకంగా చెవిలో సాలీడు పురుగులతో (Spider was found inside a woman’s ear) వచ్చి ఆశ్చర్య పరిచింది. ఈ ఘటన తైవాన్‌లో (Taiwan) లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కొద్దీ రోజులుగా ఓ మహిళ చెవి దురద తో తెగ ఇబ్బంది పడుతుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు చెవిలో వింత సౌండ్స్ కూడా వస్తుండడం తో ఇంట్లోనే కొన్ని చిట్కాలను వాడింది. అయినప్పటికీ దురద , సౌండ్స్ తగ్గలేదు. ఇక ఇలాగే ఉంటె ఏమైనా అవుతుందని భావించి డాక్టర్స్ వద్దకు వెళ్ళింది. డాక్టర్ మహిళ చెవి ని పరిశీలించగా.. ప్రాణంతో (Spider was found in ear) ఉన్న సాలీడు పురుగులను చూసి షాక్ అయ్యాడు. ఇవే ఎలా వెళ్లాయి..అని ప్రశ్నించగా ఆమె తెలియదని చెప్పింది. చివరకు ట్యూబ్ సాయంతో సాలీడును బయటికి తీశాడు. చెవికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడంతో మహిళ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also : Babu Mohan : బిజెపి కి రాజీనామా చేసే ఆలోచనలో బాబు మోహన్..?