Dubai: దుబాయ్ లో ఉన్న ఆ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తే వావ్ అనాల్సిందే?
మామూలుగా మనం పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడలా ఉన్న లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ కి వెళ్తూ ఉంటాము. అక్కడ ఉన్న అందాలను ఆస్వాదిస్తూ ఎం
- By Anshu Published Date - 05:06 PM, Wed - 16 August 23

మామూలుగా మనం పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడలా ఉన్న లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ కి వెళ్తూ ఉంటాము. అక్కడ ఉన్న అందాలను ఆస్వాదిస్తూ ఎంతసేపు గడిపిన కూడా ఇంకా కొద్దిసేపు అక్కడ గడపాలి అనిపించే విధంగా అక్కడి రిసార్టు లను అద్భుతంగా రూపొందిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే లగ్జరీ రిసార్ట్ కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. సౌదీ అరేబియాలోని ఇంతకముందు ఎప్పుడు చూడని విధంగా ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సౌదీకి చెందిన రెడ్ సీ గ్లోబల్ సంస్థ విడుదల చేసింది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దీనిని దుబాయ్ కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది.
نفخر بأن جزيرة #أمهات في #وجهة_البحر_الأحمر سترحب بطلائع زوارها قريباً! لقد وصلت نسبة الإنجاز في تطوير منتجع “سانت ريجيس البحر الأحمر” لـ 93%، فيما وصلت جاهزية منتجع “نجومه، ريتز كارلتون ريزيرف” لـ 87.%
كم هي نسبة حماسَك أنت؟ pic.twitter.com/Fyg8MCMTzs
— البحر الأحمر الدولية (@RedSeaGlobalAR) August 14, 2023
ఆధునిక టచ్‌తో పాటు, రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్‌తో విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది. ఏరియల్ అకామడేషన్ పాడ్స్ అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట. పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఉపయోగిస్తోంది. ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతాయి. షేబరా హోటల్ 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్ లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలు చూస్తే మతిపోవాల్సిందే. ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్‌లెస్-స్టీల్ ఆర్బ్‌లతో చాలాయూనీక్‌గా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.