Frank Video : ఏంటి ఈ పిచ్చి వేషాలు అంటూ సజ్జనార్ సీరియస్
Frank Video : హైదరాబాద్‌లో ఓ యువకుడు ఆర్టీసీ బస్ కండక్టర్‌ను బెదిరిస్తూ ఫ్రాంక్ వీడియో (Frank Video) తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తీవ్రంగా స్పందించారు.
- By Sudheer Published Date - 02:14 PM, Thu - 15 May 25

సోషల్ మీడియా (Social Media) వాడకం పెరగడంతో యువత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రీల్స్, ఛాలెంజ్ వీడియోలు, ప్రాంక్స్ పేరిట యువత అనుచితంగా ప్రవర్తిస్తూ, తమకే కాక ఇతరులకు కూడా ప్రమాదాలు సృష్టిస్తున్నారు. లైక్స్, ఫాలోయింగ్ కోసం చేసే వీరి ప్రయత్నాలు సమాజానికి నష్టాన్ని కలిగిస్తున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో అపరిచితులను టార్గెట్ చేసి భయపెట్టడం, ట్రాఫిక్‌కు అడ్డంగా నిలిచి వీడియోలు తీయడం వంటి చర్యలు ఇప్పుడు పోలీసుల దృష్టికి వచ్చి, నేరపూరిత చర్యలకు దారి తీస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు ఆర్టీసీ బస్ కండక్టర్‌ను బెదిరిస్తూ ఫ్రాంక్ వీడియో (Frank Video) తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ఫేమ్ కోసం విధుల్లో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలా విధులకు ఆటంకం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఆయా యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Warning : మహబూబ్‌నగర్ సీఈపై సీఎం రేవంత్ ఆగ్రహం
నెటిజన్లు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోలు తీసే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి కఠినంగా శిక్ష పడితే, ఇతరులకు బుద్ధి వస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025