Warning : మహబూబ్‌నగర్ సీఈపై సీఎం రేవంత్ ఆగ్రహం
Warning : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవ్వకముందే పైపుల బిల్లులు పెట్టడం వివాదాస్పదమవుతోంది
- Author : Sudheer
Date : 15-05-2025 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం(Review Meeting)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి (Mahabubnagar Chief Engineer Ramana Reddy)పై ఆయన తీవ్రస్థాయిలో స్పందిస్తూ, అవసరమైతే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవ్వకముందే పైపుల బిల్లులు పెట్టడం వివాదాస్పదమవుతోంది. ఈ విధానాన్ని గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అనుసరించారని భావించి, అదే పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.
Mukesh Ambani – Trumph : ట్రంప్‌తో ముకేశ్ అంబానీ భేటీ..
ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఉన్న విజిలెన్స్ కేసులపై చర్యలు తప్పవని, ఎవరైనా తప్పులు చేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. అయితే కేసులకు సంబంధం లేని అధికారులు భయపడాల్సిన అవసరం లేదని, నిబంధనల మేరకు పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా కలిపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలపై వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ, అవసరమైనంత వరకే ఒప్పంద ఉద్యోగులను తీసుకోవాలని, దీనిపై కమిటీ రూపొందించి ప్రతిపాదనలు పరిశీలిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా నేటి నుంచే సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడంతో సీఎం రేవంత్ కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్మించిన కొత్త సరస్వతి ఘాట్, 86 గదుల సముదాయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. పుష్కర వేడుకల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్న ఈ పర్యటనకి భక్తుల నుంచి పెద్ద ఎత్తున హాజరు ఉండే అవకాశం ఉంది.