Viral Video : గుడ్లగూబ పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్ గా పరిగెడుతుందో..
గుడ్లగూబలకు(Owl) చెందిన ఫొటోలు, వీడియోలు చాలానే చూసుంటారు. వాటిలో ఎక్కువగా అవి చెట్లపై కూర్చున్నవి, పైకి ఎగిరేవి ఉంటాయి. కానీ.. వాటికి భిన్నంగా ఉంటుందీ వీడియో.
- By News Desk Published Date - 09:45 PM, Wed - 10 May 23

ఒక్కోసారి సోషల్ మీడియాలో(Social Media) కొన్ని పక్షుల(Birds) వీడియోలు చూస్తే ఆహ్లాదంగా, సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో గుడ్లగూబలకు(Owl) చెందిన ఫొటోలు, వీడియోలు చాలానే చూసుంటారు. వాటిలో ఎక్కువగా అవి చెట్లపై కూర్చున్నవి, పైకి ఎగిరేవి ఉంటాయి.
కానీ.. వాటికి భిన్నంగా ఉంటుందీ వీడియో. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తుతూ ఒకరకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియోకి రన్నింగ్ గుడ్లగూబ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. రెండువేలకు పైగా అప్ వోట్స్ వచ్చాయి. కొన్ని లక్షల మంది షేర్ చేశారు.
ఓ యూజరైతే.. “గుడ్ ఈవినింగ్ మేడమ్. ఈ సాయంత్రం గుడ్లగూబ మీ వెయిటర్ గా ఉంటుంది” అని చమత్కారంతో కూడిన కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే.. “ఎంత విశిష్టమైన పెద్దమనిషి” అని, ఇంకొక యూజర్ “ఇది గుడ్లగూబ కాదు పిజియోటో” అని కామెంట్స్ చేశారు. గుడ్లగూబలు పరుగెత్తినపుడు చాలా అందంగా ఉంటాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read : Viral News : వ్యక్తిని మూడు కిలోమీటర్లు లాక్కెళ్లిన ఎంపీ కారు డ్రైవర్.. వీడియో వైరల్