Gold From Electronics : ఎలక్ట్రానిక్ స్క్రాప్ నుంచీ గోల్డ్.. శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
ఎలక్ట్రానిక్ స్క్రాప్‌లో ఉండే సర్క్యూట్ బోర్డుల నుంచి బంగారు(Gold From Electronics) అయాన్లు, నానోరేణువులను సేకరించడానికి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని కనుగొన్నారు.
- By Pasha Published Date - 12:56 PM, Mon - 10 February 25

Gold From Electronics : ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం భారీగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ దగ్గరి నుంచి టీవీ దాకా, రిఫ్రిజిరేటర్ నుంచి ఏసీ దాకా అన్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలే. వీటి వినియోగం పెరగడం వల్ల ఏటా మార్కెట్‌లోకి భారీగా ఎలక్ట్రానిక్ స్క్రాప్ వస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ స్క్రాప్ మామూలుది కాదు. దానిలో ఎంతో విలువైన గోల్డ్ దాగి ఉంటోంది. దాన్ని వెలికి తీసే దిశగా కొత్త తలుపులు తెరుచుకున్నాయి. ఆ విషయమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Chilkur Balaji : బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల అరెస్ట్
ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో గోల్డ్ ఎందుకు ?
ఎలక్ట్రానిక్ ఉపకరణాల పనితీరును నిర్ణయించేవి సర్క్యూట్ బోర్డులు, మెమోరీ చిప్‌లు. ప్రతీ ఎలక్ట్రానిక్ ఉపకరణం లోపల తప్పకుండా ఇవి ఉంటాయి. సర్క్యూట్ బోర్డులలో ఉండే టెక్నికల్ ప్రోగ్రామింగ్ ఆధారంగానే సదరు ఎలక్ట్రానిక్ ఉపకరణం పనిచేస్తుంటుంది. ఆ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్‌ను గుర్తుంచుకునే బాధ్యతను మెమోరీ చిప్‌లు నిర్వర్తిస్తుంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో ఉండే సర్క్యూట్లు, మెమోరీ చిప్‌లలో కనెక్టర్లుగా బంగారాన్ని వాడుతుంటారు. బంగారాన్నే ఎందుకు వాడుతారు ? అంటే.. దానికి తుప్పు పట్టదు. మిగతా లోహాల కంటే బంగారానికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. బంగారాన్ని నికెల్, కోబాల్ట్ లాంటి లోహాలతో కలిపి వాడితే మన్నిక ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు గోల్డ్‌ను ఈజీగా ఎలాంటి షేపులోకి అయినా మార్చేయొచ్చు. బంగారాన్ని అవసరాన్ని బట్టి తీగలుగా, ఫలకాలుగా, చిన్న తునకలుగా చేయొచ్చు. ఇతరత్రా పదార్థాలతో బంగారం చాలా తక్కువగా చర్య జరుపుతుంది. అందుకే ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో గోల్డ్ వినియోగం జరుగుతుంటుంది.
Also Read :JELLY : మీ పిల్లలు ‘జెల్లీ’ని ఇష్టాంగా తింటున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే.!!
యూఎస్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే..
ఎలక్ట్రానిక్ స్క్రాప్‌లో ఉండే సర్క్యూట్ బోర్డుల నుంచి బంగారు(Gold From Electronics) అయాన్లు, నానోరేణువులను సేకరించడానికి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని కనుగొన్నారు. హానికారక రసాయనాలను వాడకుండానే ఆ స్క్రాప్ నుంచి బంగారాన్ని సేకరించొచ్చు. ఇందుకోసం వారు వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (వీసీఓఎఫ్‌ల) పేరుతో రంధ్రాలు కలిగిన స్ఫటిక పదార్థాలను తయారు చేశారు. టెట్రా థయాఫుల్వలీన్ (టీటీఎఫ్), టెట్రాఫినైల్ ఇథలీన్ (టీపీఈ)లను వాడుకొని రెండు రకాల వీసీవోఎఫ్‌లను సిద్ధం చేశారు. టీటీఎఫ్‌తో తయారైన వీసీవోఎఫ్‌కు ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని బంగారాన్ని 99.99 శాతం మేర సేకరించే కెపాసిటీ ఉందని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. టీటీఎఫ్‌తో తయారైన వీసీవోఎఫ్‌లలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్క్రాప్‌లో ఉండే బంగారాన్ని అదే బయటికి లాగుతుంది. 16సార్లు పునర్‌వినియోగానికి ఇది అనువుగా ఉంది. బంగారంతో నిండిన ఈ వీసీవోఎఫ్ కార్బాక్సిలేషన్ అనే పద్ధతి ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను సేంద్రియ పదార్థంగా మార్చేస్తుంది.