Plane Crash: సంతోషంగా పార్టీ.. కళ్ల ముందే చూస్తుండగానే దారుణం?
మామూలుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పించేవిగా ఉంటే మరికొన్ని భయానకంగా కూడా
- By Nakshatra Published Date - 03:20 PM, Mon - 4 September 23
మామూలుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పించేవిగా ఉంటే మరికొన్ని భయానకంగా కూడా ఉంటాయి. మరికొన్ని ఒళ్ళు గగ్గుర్పొడిచే ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెప్పపాటి క్షణంలోనే ఊహించని దారుణం చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఒక జంట ఘనంగా జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేస్తుండగా ఆ దారుణం చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.
అయితే పార్టీకి భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే వీరందరి కళ్ల ముందే విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అది ఒక స్టంట్ విమానం. పార్టీలో రంగులు వెదజల్లేందుకు దానిని వినియోగించారు. ఇదే ప్రమాదానికి కారణంగా నిలిచింది. అయితే ఈ వీడియోలో జండర్ రివీల్ పార్టీలో పాల్గొన్న జంట కావలించుకోవడం, పైన విమానం నుంచి రంగులు జాలువారడాన్ని గమనించవచ్చు. ఇంతలోనే విమానం అదుపుతప్పింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడిన పైలెట్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
Pilot killed after his Piper PA-25 left wing failed at a gender reveal party in the town of San Pedro, Mexico. pic.twitter.com/6JILK7fsGm
— Breaking Aviation News & Videos (@aviationbrk) September 3, 2023
కాగా తమకు పుట్టబోయే శిశువు పాప లేక బాబు అనేది సన్నిహితుల మధ్య వెల్లడించేందుకు జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇటువంటి జండర్ రివీల్ పార్టీలు అదుపు తప్పుతున్నాయని ఫలితంగా ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కామెంట్ చేశారు. అయితే కళ్ళ ముందు పార్టీ జరుగుతుండగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అలా జరగడంతో అందరూ షాక్ కి గురయ్యారు.
Tags
Related News
Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!
తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తోంది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స