HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Pilot Dies Bathroom Plane Co Pilot Make Emergency Landing Us

US: విమానం గాల్లో ఉండగా బాత్రూంలో చనిపోయిన పైలెట్.. చివరికి?

చావు ఎప్పుడు ఏ రూపంలో ఎటునుంచి ముంచుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పటికే ఎంతోమంది ఆకస్మాత్తుగా అప్పటి వరకు నవ్వుతూ ఉన్నట్టుండి మరణించి

  • Author : Anshu Date : 17-08-2023 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us
Us

చావు ఎప్పుడు ఏ రూపంలో ఎటునుంచి ముంచుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పటికే ఎంతోమంది ఆకస్మాత్తుగా అప్పటి వరకు నవ్వుతూ ఉన్నట్టుండి మరణించిన సందర్భాలు సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా కూడా అలాంటి భయంకరమైన ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో పైలట్‌ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌ లైన్స్ వాణిజ్య విమానంలో తాజాగా ఈ విషాద ఘటన జరిగింది.

అయితే ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో దాదాపుగా 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్‌ ఇవాన్‌ అందౌర్‌ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.

వెంటనే కో పైలట్‌ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా అప్పటికీ పైలట్‌ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్‌లో వసతి కల్పించారు. ఈ దురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్‌ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని తెలిపింది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్‌లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని సంస్థ వెల్లడించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • emergency landing
  • pilot dies
  • Plane
  • us

Related News

New Supreme Leader Of Iran

Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు

  • Iran Attack

    War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd