Boy With Tiger : పులితో పిల్లాడి షికారు.. కట్ చేస్తే ఏమైందంటే ?
Boy With Tiger : పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఆ పిల్లవాడు ఏకంగా పులితో చక్కర్లు కొట్టాడు.
- Author : Pasha
Date : 02-01-2024 - 9:33 IST
Published By : Hashtagu Telugu Desk
Boy With Tiger : పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఆ పిల్లవాడు ఏకంగా పులితో చక్కర్లు కొట్టాడు. చైన్ కట్టి ఉన్న పులిని తీసుకొని ఠీవీగా ఒక పార్కులో సరదాగా తిరిగాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. లాహోర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నౌమాన్ హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ nouman.hassan1లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి ఐదు రోజుల్లోనే 3.65 కోట్ల వ్యూస్, 17 లక్షల లైక్స్ వచ్చాయి. తరుచూ పులులతో ఫీట్స్ చేసి నౌమాన్ హసన్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇటీవల నౌమాన్ హసన్ తన పులికి చైన్ కట్టి.. దాన్ని ఒక చిన్న పిల్లవాడి చేతికి ఇచ్చాడు. అనంతరం ఆ పిల్లవాడు పులితో గారాలు చేస్తూ హుషారుగా నడవసాగాడు. పిల్లాడితో దాదాపు అర నిమిషం పాటు ఫ్రెండ్లీగానే మసులుకున్న పులి.. ఆ తర్వాత తన నిజ స్వరూపాన్ని చూపించింది.
We’re now on WhatsApp. Click to Join.
పులి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పిల్లాడిపైకి పంజాను విసరబోయింది. దీంతో ఆ అబ్బాయి దడుసుకొని రెండు, మూడు అడుగులు వెనక్కి పరుగు తీశాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న నౌమాన్ హసన్ అలర్ట్ అయ్యాడు. పిల్లాడికి అడ్డుగా వచ్చి నిలబడి.. కర్రను చూపించి పులిని తన కంట్రోల్‌లోకి(Boy With Tiger) తెచ్చుకున్నాడు. ఒక పిల్లవాడి ప్రాణాలను రిస్కులో పెట్టి వీడియోలు తీసి వ్యూస్ సంపాదించే రాక్షస ఆనందం నుంచి నౌమాన్ హసన్ బయటికి రావాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. ఇలాంటి ఫీట్ల కోసం పిల్లలను వాడటం నేరంగా పరిగణించి.. కఠిన శిక్షలను అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తీసేందుకు పిల్లలను వాడి నౌమాన్ హసన్ మూర్ఖంగా ప్రవర్తించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Scholarships : స్టూడెంట్స్‌కు అలర్ట్.. స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు పెంపు
నౌమాన్ హసన్ పులులు, పాములు, మొసళ్లు, సింహాల వంటి వాటితో వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. 2023 ఆగస్టులో లాహోర్ సఫారీ జూ నిర్వహించిన వేలం నుంచి అతడు ఈ జంతువులన్నీ కొన్నాడు. జూ స్థలాన్ని ఖాళీ చేయడానికి, జూలోని జంతువులను నిర్వహించేందుకు అయ్యే మాంసం ఖర్చులను తగ్గించుకునేందుకు గత ఏడాది వేలం పాట నిర్వహించారు. ఇందులో భాగంగా జూలోని డజను సింహాలు, పులులను వేలం వేశారు. వాటిలో రెండు నుంచి మూడు సింహాలను నౌమాన్ హసన్ కొన్నాడు.ఈవిధంగా పాకిస్తాన్‌లోని వివిధ జూలు నిర్వహించే వేలంపాటలకు వెళ్లి.. నౌమాన్ హసన్ అటవీ జంతువులను కొని తన ఇంట్లోని ప్రత్యేక షెడ్‌లో పెంచుతుంటాడు.