Affair : అసలు ఈమె తల్లేనా..? ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి కోసం కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలేసింది ఛీ..ఛీ !!
Affair : రెండు సంవత్సరాల చిన్నారిని ఒంటరిగా బస్టాండ్‌లో వదిలేసి, ఓ మహిళ(Woman) తన ప్రేమికుడితో వెళ్లిపోయిన దృశ్యం ( leaving with a lover) అందరి హృదయాలనూ కలచివేసింది
- By Sudheer Published Date - 08:16 PM, Sun - 27 July 25

నల్గొండ ఆర్టీసీ బస్టాండ్(Nalgonda RTC Bus Stand)లో శనివారం చోటుచేసుకున్న ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓ రెండు సంవత్సరాల చిన్నారిని ఒంటరిగా బస్టాండ్‌లో వదిలేసి, ఓ మహిళ(Woman) తన ప్రేమికుడితో వెళ్లిపోయిన దృశ్యం ( leaving with a lover) అందరి హృదయాలనూ కలచివేసింది. ఆ చిన్నారి భయంతో ఏడుస్తుండటాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే ఆర్టీసీ సిబ్బందిని అప్రమత్తం చేసి వేసి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సైదులు వెంటనే స్పందించి సంఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
EV Prices Hiked: షాక్ ఇస్తున్న ఎలక్ట్రిక్ కారు.. ఏడు నెలల్లో మూడోసారి ధర పెంపు!
హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ నల్గొండకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటూ బంధాన్ని ప్రేమగా మలచుకున్నారు. యువకుడిని కలవాలనే ఉద్దేశంతో ఆమె తన కుమారుడిని తీసుకుని నల్గొండకు బయలుదేరింది. బస్టాండ్‌లో దిగిన అనంతరం యువకుడిని ఫోన్ చేయగా, అతడు బైక్‌పై వచ్చి ఆమెను వెంట తీసుకెళ్లాడు. కానీ తన బిడ్డకు ఆటంకంగా భావించిన ఆమె, చిన్నారిని ఓ బెంచీపై కూర్చోబెట్టి అక్కడే వదిలేసి ప్రేమికుడితో వెళ్లిపోయింది.
Shubman Gill: 35 ఏళ్ల కల.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చరిత్ర సృష్టించిన కెప్టెన్ గిల్, రికార్డులీవే!
చిన్నారి “మమ్మీ” అని అరవడం చూసిన ప్రయాణికులు తీవ్రంగా చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించారు. విచారణలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తేలింది. అనంతరం పోలీసులు తల్లిని, యువకుడిని, భర్తను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. చివరికి బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి అని చెప్పుకునే ఆమె ఇలా పుట్టిన బిడ్డను వీడిపోవడం హృదయాన్ని కలచివేస్తుందని అన్నారు. ప్రేమ పేరుతో బంధాలను తృణప్రాయంగా భావించడం, తల్లిగా బాధ్యతల్ని విస్మరించడం సామాజికంగా పెద్ద ప్రశ్నగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.