Montenegro’s Gushing Water Tree : చెట్టు తొర్రలో నుండి పొంగిపొర్లుతున్న నీరు..చూసేందుకు వస్తున్న ప్రజలు
1990ల నుంచి ఈ చెట్టు నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇందుకు ఇలా నీరు వస్తుందని పరిశోధించడం ప్రారంభించారు.
- By Sudheer Published Date - 12:47 PM, Mon - 20 November 23

చెట్టు (Tree ) నీడనిస్తుంది..పండ్లును ఇస్తుందని మాత్రమే తెలుసు..కానీ నీటిని (Water) కూడా ఇస్తుందని ఈ మధ్యనే తెలుసుకుంటున్నాం. అది కూడా చిన్న చితకగ సన్న ధారలా కాదు పెద్ద ఎత్తున ఓ ప్రవాహం మాదిరిగా పొంగిపొర్లుతోంది. ఈ ప్రవాహాన్ని చూసేందుకు జనాలు పోటీపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా..?యూరప్ దేశం మాంటెనెగ్రో (Montenegro) లో ఈ వింత జరుగుతుంది. దినోసా గ్రామానికి వెళ్లి అడ్రెస్ అడిగితే…. ఆ చెట్టు ఎక్కడుందో ఊరి ప్రజలు చెబుతారు. అది 365 రోజులూ నీరు ఇవ్వదు. చెట్టు ఉన్న ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు… వర్షం తగ్గినా… చెట్టు కాండం నుంచి నీరు ధారలా, చిన్న సైజు జలపాతంలా బయటకు వస్తూ ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ చెట్టును కొంతమంది మాయా చెట్టు అని అంటే మరికొందరు అద్భుతం అని అంటున్నారు. ఇక ఈ చెట్టుని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల పురాతన మల్బరీ చెట్టు ఇది. 1990ల నుంచి ఈ చెట్టు నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇందుకు ఇలా నీరు వస్తుందని పరిశోధించడం ప్రారంభించారు. ఆలా ఎందుకు వస్తున్నాయో కనుగొన్నారు. ఈ మల్బరీ చెట్టు పెరుగుతున్న గడ్డి మైదానంలో, అనేక భూగర్భ నీటి బుగ్గలు ఉన్నాయని తేలింది. భారీ వర్షం కురిసినప్పుడల్లా అదనపు ఒత్తిడి కారణంగా, ఈ నీరు చెట్టు యొక్క తొర్ర ద్వారా నీరు బయటకు వస్తుంది. ఆలా వర్షం పడినప్పుడల్లా నీరు బయటకు వస్తుంటుంది. అది ఈ చెట్టు రహస్యం. ఇక ఇలాంటి చెట్లు అక్కడక్కడా ఉన్నాయని అంటున్నారు. కామెరూన్ లోని బుయాలో మరో చెట్టు ఉంది. అది కూడా అంతే… దాని కాండానికి చిన్న కన్నం పెడితే చాలు… అక్కడి నుంచి నీరు ధారలా బయటకు చిమ్ముతుంది. ఆ నీటిని తాగవచ్చు అంటున్నారు.
Terminalis tomentosa, Crocodile bark tree or Sain. This tree can quench your thirst in rare circumstances. pic.twitter.com/DbbsBns94Z
— Digvijay Singh Khati (@DigvijayKhati) June 14, 2020
Read Also : world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు