Monkeys save 6-year-old Girl : కామాందుడి నుండి బాలికను కాపాడిన కోతులు
Monkeys save 6-year-old Girl : పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి.. ఒంటిపై దుస్తులు తొలగించి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొన్ని కోతులు అతడివైపు దూసుకొచ్చి
- By Sudheer Published Date - 01:52 PM, Mon - 23 September 24

Monkeys Turned Saviour For 6-Year-Old Girl As Rape Attempt : సినిమాల్లో హీరోయిన్ ను విలన్ రేప్ చేస్తుంటే హీరో వచ్చి కాపాడతాడు..అలాగే వన్య ప్రాణులు సైతం కాపాడడం వంటివి ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం..క్లాప్స్ కొడుతుంటాం. నిజ జీవితంలోకి వచ్చేసరికి ఇలాంటివి చాల అరుదు. తాజాగా అలాంటి అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి ఫై ఓ కామాంధుడు కన్నేసి..అత్యాచారం చేయబోతుండగా.. వానరసైన్యం (Monkeys ) వచ్చి ఆ కామాంధుడి పై దాడికి దిగి, ఆ చిన్నారిని కాపాడాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
దేశ వ్యాప్తంగా మహిళలకు , అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది జరిగేలాలేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే కాదు స్కూల్ , హాస్టల్స్ ఇలా ప్రతి చోట ఇదే జరుగుతుంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు కామ పిశాచులు.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని బాగ్‌పత్ (Baghpat )లో ఆరేళ్ల చిన్నారి (6-year-old Girl)కి చాక్లెట్ ఆశ చూపి ఓ గుర్తు తెలియని వ్యక్తి..పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి.. ఒంటిపై దుస్తులు తొలగించి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొన్ని కోతులు అతడివైపు దూసుకొచ్చి.. దాడి చేశాయి. దీంతో ఆ చిన్నారిని అక్కడ వదిలేసి నిందితుడు పరారయ్యాడు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన బాలిక.. తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. అలాగే కోతులు తనను ఎలా కాపాడాయే వారికి వివరించింది. ఇక బాలిక తండ్రి మాట్లాడుతూ.. ‘ఇంటి బయట ఆడుకుంటుండగా తన కుమార్తెను నిందితుడు తీసుకెళ్లాడు.. ఓ ఇరుకు సందు నుంచి పాపను తీసుకెళ్లడం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.. నిందితుడ్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.. వాడు నా కూతుర్ని చంపుతానని బెదిరించాడు.. సమయానికి కోతులు అక్కడకు రాకపోయి ఉంటే నా కుమార్తె చనిపోయి ఉండేది’ అని వాపోయాడు. ఆ హనుమంతుడే మా పాపను కాపాడడంటూ ఆ తండ్రి చెప్పుకొచ్చాడు.
Read Also : Devara : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు పై శ్రేయస్ మీడియా క్లారిటీ