Pet Dog: యజమాని బొటనవేలు కొరికేసిన కుక్క.. కానీ అదే అతనికి వరమైందట?
సాధారణంగా మనం ఇంట్లో అనేక రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతం మంది ఇంట్లో
- By Anshu Published Date - 07:00 PM, Fri - 21 April 23

సాధారణంగా మనం ఇంట్లో అనేక రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతం మంది ఇంట్లో పిల్లిలు లేదా కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ పెంపుడు జంతువుల వల్ల మనకు మంచి జరుగుతుంది కొన్నిసార్లు చెడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా యూపీలో పెంపుడు కుక్క యజమాని బొటనవేలు కొరికేసింది. కానీ అదే అతనికి వరంలా మారింది అని అంటున్నారు ఆ యజమాని. అసలేం జరిగిందంటే.. యూకే కి చెందిన డేవిడ్ లిండ్సే తన పిటబుల్ డాగ్ హార్లేతో సోఫాలో పడుకున్నాడు. ఆ సమయంలో అతని పెంపుడు కుక్క 7 నెలల బుల్ డాగ్ అతని కాలి వేలును కొరికేసింది.
అయితే ఆ కుక్క కాలి బొటనవేలు నమిలేస్తుండగా అతని భార్య గట్టిగా అరవడంతో వెంటనే అతడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ యజమాని లేచి కాలి దగ్గర కుక్క ఏం చేస్తుందో అని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కుక్క కాలి బొటనవేలు కొరకడంతో పాటు పాటు ఒక గోరు వేలాడుతూ కనిపించింది. మొదట అది చూసి ఆ దంపతులు ఇద్దరు షాక్ అయ్యారు. కానీ అదే అతడికి వరంగా మారింది. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే ఎముక బయటకు వచ్చేలా ఆ కుక్క కొరికినా కూడా అతనికి నొప్పి తెలియలేదు. వెంటనే అతను ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు.

Pet Dog
తనకు డయాబెటిస్ వచ్చిందని శరీరంలో రెండు ధమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని డాక్టర్లు తెలిపారు. రక్తం సరిగా సరఫరా కాకపోవడం వల్లే తనకు కుక్క దాడి చేసిన కూడా స్పర్శ తెలియలేదని వైద్యులు తెలిపారు. కుక్క ఆ విధంగా దాడి చేయడం వల్ల డాక్టర్లు తనకు డయాబెటిస్ వచ్చింది అన్న విషయాన్ని చెప్పారు అని ఆ ఇంటి యజమాని తెలిపారు. ఆ కుక్క గాయం చేయడం ఒకరకంగా తనకు మంచిదే అయిందని అందువల్ల ఆ కుక్కను బయటికి పంపించే ఆలోచన కూడా తనకు లేదు అని చెప్పుకొచ్చాడు. అయితే అతను ఎముకకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండడం కోసం వైద్యులు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో పాటు అతని తొమ్మిది రోజులపాటు ఆస్పత్రిలో ఉండమని తెలిపారు. చికిత్స తీసుకున్న తర్వాత అనంతరం అతని డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందువల్ల అతని కాలి బొటన వేలును తీసేశారు.