ChatGPT: సంసారంలో చిచ్చుపెట్టిన చాట్ జిపిటి.. భర్త ఆ పని చేయడంతో?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ రావడంతోనే
- By Nakshatra Published Date - 05:30 PM, Wed - 12 April 23
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ రావడంతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీని దెబ్బకు పలు అంతర్జాతీయ సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి. మార్కెట్లోకి వచ్చిన కేవలం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ వినియోగదారులను సంపాదించుకొని సరికొత్త రికార్డును సృష్టించింది. వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వమంటూ చాట్ జీపీని అడుగుతున్నారు.
దీంతో గంట గంటకి ఈ చార్ట్ జీపీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. కానీ ఈ చాట్ జీపీటీ వల్ల ఇంట్లో మనస్పర్ధలు వస్తాయని చాలామంది ఊహించి ఉండదు. అదేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే. హాంకాంగ్ లో ఇద్దరు భార్యాభర్తల మధ్య ఈ చాట్ జీపీటీ చిచ్చు పెట్టింది. అసలు ఏం జరిగిందంటే.. హాంకాంగ్ కు చెందిన ఒక జంట త్వరలోనే బిడ్డను కనాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భార్య కాబోయే బిడ్డకు మంచి పేరు సూచించాలనే భర్తను కోరింది. ఇక భర్త భార్య కోరిక మేరకు బిడ్డ కోసం మంచి పేరు పెట్టడానికి చాట్ జీపీటీ ని ఉపయోగించాడు. చాట్ జీపీటీని ఉపయోగించగా అతనికి చాట్ జిపిటి కొన్ని పేర్లను సూచించగా అందులో ఏవి భర్తకు నచ్చకపోవడంతో మళ్లీ ప్రశ్నించాడు.
చివరకు చాట్ జీపీటీ సెలెక్ట్ చేసిన ఒక పేరు వచ్చింది. కానీ ఆ విషయం కాస్త భార్యకు తెలియడంతో ఆమె మండి పడింది. పాపకు తండ్రి ఎవరు మీరా లేకపోతే చాట్ జీపీటీ నా అంటూ నేరుగా భర్తను ప్రశ్నించింది. ఇదే విషయం గురించి ఒక మహిళ వేదికపై మాట్లాడడం మాత్రమే కాకుండా ఇటీవల ఈ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
Related News
Pragya Misra: తొలి భారత ఉద్యోగిని నియమించిన ఓపెన్ఏఐ.. ఎవరీ ప్రగ్యా మిశ్రా..?
ChatGPT తయారీదారు OpenAI భారతదేశంలో ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ మొదటి ఉద్యోగి పేరు ప్రగ్యా మిశ్రా.