Lady Aghori First Wife : అఘోరి నా మొగుడు అంటూ మరో యువతీ సంచలనం
Lady Aghori First Wife : అఘోరీ మొదట తనతో గొప్ప ప్రేమ చూపించి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత ఆమెతో సంబంధం విడిచేసి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది
- Author : Sudheer
Date : 14-04-2025 - 3:03 IST
Published By : Hashtagu Telugu Desk
లేడీ అఘోరీ(Lady Aghori)గా గుర్తింపు పొందిన శ్రీనివాస్ (Srinivas) పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. రాధ (Radha)అనే యువతీ తనను ఏడాది క్రితం కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరీ వివాహం చేసుకున్నాడని తెలిపి షాక్ ఇచ్చింది. వెండి తాడుతో తాళి కట్టినట్లు తెలిపింది. ఇటీవల వర్షిణి (Varshini) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని, నిజాలు వెలుగులోకి తీసుకరావాలని ఆమె బయటకు వచ్చినట్లు పేర్కొంది. తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడానికి అఘోరీతో జరిగిన వ్యక్తిగత సంభాషణల ఆడియో క్లిప్స్‌ను కూడా మీడియాకు విడుదల చేసింది.
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
అఘోరీ మొదట తనతో గొప్ప ప్రేమ చూపించి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత ఆమెతో సంబంధం విడిచేసి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. వర్షిణి చిన్నపిల్ల అని, ఆమె జీవితాన్ని బలవంతంగా బలి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన నెంబర్ బ్లాక్ చేయడం, తాళి తిరిగి తీసుకెళ్లడం వంటి చర్యలు తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పింది. ఆమె అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతోంది.
ఈ వివాదం ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది. రాధతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, రుద్ర స్వామి అనే భక్తుడు కూడా అఘోరిపై నిప్పులు చెరిగారు. శ్రీనివాస్ అసలు నిజమైన అఘోరీ కాదని, అతడు పక్కా ఫేక్ అని ఆరోపించారు. ఎందరో మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. వర్షిణికి ఈ విషయాలు తెలిసిన తరువాత పరిస్థితి ఏవిధంగా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్ట్‌లు జరుగుతాయో చూడాలి.
అఘోరి మొదటి భార్యను నేనే.. ఇదిగో ప్రూఫ్స్
Lady Aghori First Wife#Aghori #SriVarshini #aghorinagasadhu #LadyAghoriFirstWife #LatestNews #TrendingNow #BIGTVcinema pic.twitter.com/TtxueglzfD
— BIG TV Cinema (@BigtvCinema) April 14, 2025