Kerala Farmer : వీడు మాములు రైతు కాదు..ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు
తనకు వ్యవసాయం పట్ల ఇష్టం ఉండటంతో తనకు వచ్చిన పనితో కొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించడం ప్రారంభించాడు
- By Sudheer Published Date - 12:25 PM, Sat - 30 September 23

రైతు (Farmer ) అనగానే పంచెకట్టుతో ..భుజాన కండువా వేసుకొని..చెమటతో..సైకిళ్ల ఫై , ఎడ్ల బండ్లపై తిరుగుతుంటారని అంత భావిస్తారు..అలాగే చెపుతుంటారు. అతడి జీవన శైలి అదే అంత ఫిక్స్ అవుతుంటారు. కానీ ఇప్పుడు రైతులు కూడా రూట్ మార్చారు. రైతు అంటే అలాగే ఉంటారనే వారికీ షాక్ ఇస్తూ..రైతు అంటే ఇలా కూడా ఉంటారా..అని ఆశ్చర్యపోయేలా స్టయిల్ మార్చారు. దీనికి ఉదాహరణే కేరళలో ఆకుకూరలు అమ్మే రైతు సుజిత్ (Sujith SP).
సాధారణంగా పండించిన పంట ను మార్కెట్ లో ఎలా అమ్ముతారో తెలిసిందే. కానీ ఇక్కడ సుజిత్ మాత్రం ఏకంగా రూ.44 లక్షల విలువ చేసే ఆడీ ఏ4 (Audi A4) కారులో వచ్చి.. తన పొలంలో పండించిన ఆకు కూరలను అమ్ముతుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. నిత్యం రోడ్ ఫై సుజిత్ ఇలాగే తన ఆకుకూరలని అమ్ముతుంటాడు. కారు లోని నుండి చాపను తీసి నేలపై పరిచి.. ఆకు కూరలను తీసి ఆ చాపలో పెట్టి అమ్ముతుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది చూడగా.. కామెంట్లు కూడా పెడుతున్నారు.
Read Also : Pawan Kalyan: రేపు అవనిగడ్డలో పవన్ బహిరంగ సభ, ‘వారాహి విజయ యాత్ర’ షురూ
తన వ్యవసాయానికి టెక్నాలజీ, అత్యాధునిక పద్దతులు జోడించి లాభసాటి వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సుజిత్ ముందు నుంచీ వ్యవసాయం చేసేవాడు కాదట.. ఒక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసాడు. అందులో లాభాలు రాకపోవడంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు వ్యవసాయం పట్ల ఇష్టం ఉండటంతో తనకు వచ్చిన పనితో కొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించడం ప్రారంభించాడు. ఇలా సరికొత్త పద్దతిలో వివిధ రకాల పంటలు పండిస్తూ..లాభాలు అందుకుంటున్నాడు. వ్యవసాయంలో సక్సెస్ కావడం తో తనకు ఎంతో ఇష్టమైన రూ.44 లక్షల విలువైన ఆడీ ఏ4 కారును కొనుగోలు చేసి..దానినే వాడుకుంటున్నాడు. ఇలా ఇష్టంతో చేసే పని ఎంతో ఆనందంగా ఉంటుందని సుజిత్ చెపుతున్నాడు.
వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి..