Pawan Kalyan: రేపు అవనిగడ్డలో పవన్ బహిరంగ సభ, ‘వారాహి విజయ యాత్ర’ షురూ
అక్టోబరు 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో జనసేన అధినేత వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
- By Balu J Published Date - 12:15 PM, Sat - 30 September 23

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాలోని అవనిగడ్డలోని దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగబోయే బహిరంగసభలో పాల్గొననున్నారు. తన వాహనం ‘వారాహి’ పైనుంచి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ‘వారాహి విజయ యాత్ర’ పేరుతో నాలుగో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 3.00 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది.
అక్టోబరు 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో తన పర్యటనలో జనసేన అధినేత వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దాని ప్రకారం అక్టోబర్ 1న అవనిగడ్డలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మచిలీపట్నం వెళ్లనున్నారు. అక్టోబర్ 2న కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నాయకులతో, 3న వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబరు 4న పెడన అసెంబ్లీ సెగ్మెంట్‌లో, 5న కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పర్యటించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: Bhatti Vikramarka: కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలపై కేసీఆర్ కుట్ర: భట్టి విక్రమార్క