Jagan London Trip : జగన్ లండన్ టూర్ ఖర్చు ఎంతో..? ఆ డబ్బుతో ఎంతమందికి మేలు జరిగేదో తెలుసా..?
ఇంత మంది సొమ్మును కేవలం నీ Lagjari ప్రయాణం కోసం వాడుకున్నావ్ జగన్ (Jagan)
- By Sudheer Published Date - 11:43 AM, Wed - 13 September 23
ఏపీ పేద సీఎం జగన్ మోహన్ రెడ్డి రీసెంట్ గా తన ఫ్యామిలీ తో కలిసి లండన్ టూర్ (Jagan London Trip) కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 03 న శనివారం రాత్రి 9.30 గంటలకు విజయవాడ నుంచి జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ కు వెళ్లి…సోమవారం (September 11) విజయవాడ కు చేరుకున్నారు. ఇదంతా ఓకే.
నెలకు రూపాయి జీతం తీసుకుంటున్న పేద సీఎం ను..నేను ఒక పేదవాడ్ని..ఏ సొంత మీడియా లేదు..పెత్తందారులతో నిత్యం యుద్ధం చేస్తున్న అంటూ నిత్యం చెప్పుకునే జగన్..ఈరోజు ఎక్కడికి వెళ్లాలన్న ప్రత్యేక విమానాలే (Special Fights).. విజయవాడ నుండి ఇడుపులపాయ కు వెళ్లాలన్న ప్రత్యేక విమానమే..విజయవాడ నుండి ఓ 20 కిమీ వెళ్లాలన్న ప్రత్యేక విమానమే..చివరికి సొంత పనిమీద విజయవాడ నుండి లండన్ వెళ్లాలన్న ప్రత్యేక విమానమే..మరి ఇలా విమానాల్లో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి జగన్.. ? ఈ విమాన ఖర్చులకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు..? పేదవాడి అంటూ చెప్పుకునే నీకు ఇంత డబ్బుకు ఎక్కడిది..? అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు , యువత అంత మాట్లాడుకుంటున్న ప్రశ్నలు.
Read Also : Andhra Pradesh : చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా విమానంలో నిరసన చేసిన యువకుడు
ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెపుతావు..టైం కు జీతాలు ఇవ్వవు..ఆ టాక్స్ ..ఈ టాక్స్ ..చెత్త టాక్స్ అని ప్రజల నుండి డబ్బు వసూళ్లు చేస్తావు..అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోతలు పెడతావు..దేవుడి దయతో బటన్ నొక్కుతున్న అంటావ్..మరి ఇంత చెప్పుకొచ్చే నువ్వు..ఇంత Lagjari లైఫ్ ను ఎలా అనుభవిస్తున్నావు..? ఇంత Lagjari విమానాలు ఎక్కేందుకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. నువ్వు అధికారం చేపట్టిన దగ్గరి నుండి బస్ చార్జీలు..విద్యుత్ చార్జీలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు ఇలా అన్నిధరలు పెంచి..ఇంకా రాష్ట్రాన్ని చీకట్లోనే ఉంచుతున్నావు. అంతేనా కేంద్రం నుండి వేల కోట్లు తీసుకొస్తున్నావు..అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి..? అనేది సామాన్యుడి ప్రశ్న.
ఇక లండన్ టూర్ (Jagan London Trip) విమాన ఖర్చు విషయానికి వస్తే…
లండన్ లో ఉంటున్న తన కూతురు చూసేందుకు జగన్ దంపతులు ‘ఎంబ్రాయెర్ లీనేజ్ 1000’ (Private Jet Embraer Lineage 1000) అనే Lagjari విమానంలో విజయవాడ నుండి లండన్ కు వెళ్లారు. దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. 435 కోట్ల ఈ Lagjari విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయొచ్చు. ఈ విమానానికి గంటకు 18 వేల 450 డాలర్లు చెల్లించాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం గంటకు 2 లక్షల 71 వేలు (2.71 Lakh Rupees per hour ). ప్రయాణ ఇంధన ఖర్చు కూడా ఎవరు బుక్ చేసుకున్నారో వారే కట్టుకోవాలి. అక్కడ పార్కింగ్ ఫీజు..మిగతావన్నీ కూడా ఆయనే పెట్టుకోవాలి. ఇక విజయవాడ నుండి లండన్ కు వెళ్ళడానికి , రావడానికి 22 గంటలు పడుతుంది. ఇన్ని గంటలకు జగన్ ఎంత ఖర్చు పెట్టి ఉంటారు..? అనేది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నదని బట్టి చూస్తే.. జగన్ ఒక్క ప్రయాణ ఖర్చు 43 వేల కోట్లు (43 thousand crore ) అయ్యిందని అంటున్నారు. ఈ 43 వేల కోట్ల వల్ల ఎంతమంది ప్రజలు ఉపయోగపడేది చెప్పుకొచ్చారు. వారు ఎవరో..ఇప్పుడు చూద్దాం.
సీఎం జగన్ లండన్ టూర్ ఖర్చు 43 వేల కోట్లు..రాష్ట్రంలో 1,56,363 మందికి నెల వృద్యాప్య పెన్షన్ తో సమానం.
ఈ 43 వేల కోట్లు..1,43,333 వికలాంగుల నెల వృద్యాప్య పెన్షన్ తో సమానం
ఈ 43 వేల కోట్లు..86,000 వాలెంటరీల నెల జీతంతో సమానం
ఈ 43 వేల కోట్లు..43, 000 మంది డయాలసిస్ పేషంట్ల కు నెల జీతంతో సమానం
ఈ 43 వేల కోట్లు..28,666 సచివాలయ ఉద్యోగులకు నెల జీతం తో సమానం
ఈ 43 వేల కోట్లు..28,666 పిల్లలకు ఏడాది అమ్మఒడితో సమానం
ఈ 43 వేల కోట్లు..ఎన్నోమద్య తరగతి కుటుంబాల నెల జీతం తో సమానం
ఈ 43 వేల కోట్లు..లక్షలాది మంది అనాధ పిల్లల భవిష్యత్ కు సమానం..ఇంత మంది సొమ్మును కేవలం నీ Lagjari ప్రయాణం కోసం వాడుకున్నావ్ జగన్ అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Tags
Related News
Congress vs YSRCP : శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చిందా..!
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు లాభపడగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.