Maharashtra: ఇదేందయ్యా ఇది.. ప్రయాణిస్తున్న ట్రక్కు నుంచి మేకలను చోరీ.. ఆపై అలా?
ఈ మధ్యకాలంలో దొంగలు దొంగతనం చేయడానికి విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా బాగా ఉపయోగిస్తూ దొంగతనాలు చేయడం మొదలు పెడుతున్నారు.
- By Anshu Published Date - 07:34 PM, Tue - 2 May 23

ఈ మధ్యకాలంలో దొంగలు దొంగతనం చేయడానికి విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా బాగా ఉపయోగిస్తూ దొంగతనాలు చేయడం మొదలు పెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ఒక దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు లో ఉన్న చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఒక కారు వచ్చింది.
ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్‌గా ఎస్కేప్ అయ్యాడు. అయితే అందుకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిందని ప్రచారం జరగగా దాంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించగా,ఆ ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్‌పురి ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు.
कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा….
वीडियो गौर से देखिए……..@Uppolice pic.twitter.com/ytC6m6owgI— Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023
అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయి ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ ట్రక్ వెనకాలే వస్తున్న వాహనదారులు కొంతమంది అందుకు సంబంధించిన దృశ్యాన్ని వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.