Urine in Juice : జ్యూస్‌లో యూరిన్..కనిపెట్టి చితకబాదిన కస్టమర్లు
Urine in Juice : జ్యూసుల్లో మానవ మూత్రం (యూరిన్) కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలు బయటకు వచ్చాయి. దీంతో ప్రజలను ఆమిర్ ఖాన్‌ను తీవ్రంగా కొట్టారు.
- By Sudheer Published Date - 04:22 PM, Sat - 14 September 24

Ghaziabad shopkeeper thrashed by locals for mixing urine with juice : జ్యూస్‌లో యూరిన్ (Urine ) కలిపి విక్రయం చేస్తున్న జ్యూస్ (Fruit Juices) యజమానిని కస్టమర్లు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ (Ghaziabad )లో చోటుచేసుకుంది. ఇటీవల ఈ తరహా ఘటనలు చాల చోట్ల జరుగుతున్నాయి. అసలే బయట ఫుడ్ రోజు రోజుకు దారుణంగా ఉంటుందని రసాయనాలు కలపడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని పలు ఘటనలు వెలుగులోకి వస్తుండగా..ఇక ఇప్పుడు జ్యూస్ లలో మూత్రం కలిపి అమ్ముతున్న ఘటనలు ప్రజలను ఖంగారుకు గురి చేస్తున్నాయి.
గాజియాబాద్‌లోని బోర్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్‌ను ఆమిర్ ఖాన్ (Aamir Khan) అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతడు జ్యూసుల్లో మానవ మూత్రం (యూరిన్) కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలు బయటకు వచ్చాయి. దీంతో ప్రజలను ఆమిర్ ఖాన్‌ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల నుంచి అమీర్ ఖాన్‌ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసే మైనర్‌ను స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఏసీపీ భాస్కర్ వర్మ మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ అనే వ్యక్తి తన జ్యూస్ పాయింట్లో జ్యూస్ లో మానవ మూత్రం కలిపి అమ్ముతున్నారని ఫిర్యాదు అందిందని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, మూత్రంతో నిండిన పెద్ద సీసా లభించిందని వెల్లడించారు. దానిని టెస్టులకు పంపామని పేర్కొన్నారు. మూత్రంతో నిండిన సీసా గురించి యజమానిని ప్రశ్నించినా, ఆయన నుంచి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం అమిర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Read Also : Zika Vaccine : జికా వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్