Dowry : అక్కడ పెళ్లి కూతురికే కట్నం.. అది ఆచారం..ఎక్కడంటే..!!
Dowry : ఈ ఆచారం ప్రకారం వరుడి కుటుంబమే వధువుకు ఆర్థిక సహాయం, బహుమతులు, ఆస్తులు అందజేస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, భూమి, గృహోపకరణాలు, నగలు, ఇతర విలువైన వస్తువులు కూడా కానుకలుగా ఇస్తారు
- By Sudheer Published Date - 03:51 PM, Sun - 2 March 25

భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేక ప్రాంతాల్లో, అనేక విధాలుగా రకరకాల సంప్రదాయాలను కలిగి ఉంది. చాల రాష్ట్రాల్లో పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి కట్నం (Dowry ) ఇవ్వడం సర్వసాధారణం. కానీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గలో తెగ (Galo Tribe) ఈ సంప్రదాయానికి భిన్నంగా, వధువుకే కట్నం ఇచ్చే అరుదైన పద్ధతిని పాటిస్తుంది.
గలో తెగలో “అరి” (Ari) అనే ప్రత్యేక ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం వరుడి కుటుంబమే వధువుకు ఆర్థిక సహాయం, బహుమతులు, ఆస్తులు అందజేస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, భూమి, గృహోపకరణాలు, నగలు, ఇతర విలువైన వస్తువులు కూడా కానుకలుగా ఇస్తారు. ఈ విధానం వధువుకు గౌరవాన్ని, భద్రతను అందించడమే లక్ష్యంగా అమలవుతుంది. ఈ తెగ ప్రజలు పెళ్లి అనేది రెండు కుటుంబాల మైత్రికి నిదర్శనం అని నమ్ముతారు. కట్నం ఇచ్చే ఈ ఆచారం ద్వారా రెండు కుటుంబాల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తారు. అదే సమయంలో వధువు కొత్త ఇంట్లో ఆర్థిక భద్రత పొందేలా చూడడం కూడా ముఖ్య ఉద్దేశ్యంగా భావిస్తుంటారు. ఈ సంప్రదాయం సమాజంలో మహిళలకు గౌరవాన్ని, సమానత్వాన్ని కల్పించేలా ఉండటం విశేషం.
Posani : పోసాని నాటకాలు ఆడుతున్నాడు – పోలీసుల కామెంట్స్
భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కట్నం కోసం వధువు కుటుంబాలను ఒత్తిడి చేయడం, వేధించడం వంటి దుష్ప్రవర్తనలు కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో గలో తెగ అనుసరించే పద్ధతి మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది సమాజంలో లింగ సమానత్వానికి, మహిళల హక్కులకు బలమైన సంకేతంగా నిలుస్తుంది. ఈ విధానం ఇతర ప్రాంతాల్లో కూడా ప్రేరణగా మారితే, కట్న దురాచారానికి చెక్ పెట్టి మహిళలకు మరింత గౌరవం కలిగించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.