Father’s Love: ఇలాంటి తండ్రి ఉన్నందుకు గర్వించాల్సిందే, తండ్రీకూతుళ్ల వీడియో వైరల్!
ఓ తండ్రీకూతుళ్ల ఆప్యాయతానురాగాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
- By Hashtag U Published Date - 11:55 AM, Mon - 26 June 23
నాన్నంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు.. భరోసా కూడా. పిల్లలకు ఏదీ కావాలో, వారు ఏంఆశిస్తున్నారో తెలుసుకొని వాళ్ల లక్ష్యాలు, ఇష్టాలను నెరవేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ తండ్రీకూతుళ్ల ఆప్యాయతానురాగాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. షృత్వా దేశాయ్ గ్రాడ్యుయేషన్ కోసం కెనడా వెళ్లింది. స్థానికంగా ఓ షాపులో పనిచేస్తూ చదువు కొనసాగిస్తోంది. విదేశాలకు వెళ్లి ఏడాదిన్నరైనా ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆమె తండ్రే అక్కడికి వెళ్లాడు.
ఎదురుగా తండ్రి కనిపించేసరికి దేశాయ్ అవాక్కయింది. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని ఆనందబాష్పాలతో అలాగే కూర్చుండి పోయింది. దగ్గరకు వెళ్లిన తండ్రి ఆప్యాయంగా బిడ్డను హత్తుకొని కన్నీరుమున్నీరు అయ్యాడు. ‘‘నాన్నను చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగి మళ్లీ కొట్టుకుంది. నన్ను చూసేందుకు దేశాలు దాటి ఇంతదూరం వచ్చారా? ఈ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. ఇలాంటి తండ్రి ఉన్నందుకు గర్విస్తున్నా’’ అంటూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.
Also Read: Road Accident: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 25 మందికి తీవ్ర గాయాలు, 4 పరిస్థితి విషమం
Related News
Aashritha Election Campaign: వెంకటేష్ కూతురు తొలి రాజకీయ ప్రసంగం
రఘురామ్ రెడ్డి తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తరుపున ఖమ్మం లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా తన మామ కోసం కోడలు ఆశ్రిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది ఆమెకు తొలి రాజకీయ ప్రసంగం కావడం విశేషం.