Car Driving : నిద్ర మత్తులో కారు ను ఏకంగా గోడపైకే ఎక్కించిన డ్రైవర్
Car Driving : శంభీపూర్‌లో ఓ డ్రైవర్ ఏకంగా తన కారును ఓ ఇంటి గోడపైకి ఎక్కించడం(Driver Crashes House Wall)తో అందరూ షాక్‌కి గురయ్యారు
- By Sudheer Published Date - 03:47 PM, Fri - 25 July 25

తెలంగాణ మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం (Road Accident ) అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా నిద్రమత్తు కారణంగా వాహనదారులు రోడ్డు మీద అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతుంటారు. కానీ శంభీపూర్‌లో ఓ డ్రైవర్ ఏకంగా తన కారును ఓ ఇంటి గోడపైకి ఎక్కించడం(Driver Crashes House Wall)తో అందరూ షాక్‌కి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
జూలై 25, 2025 రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బయటకు వచ్చి చూసేసరికి ఓ కారు ఇంటి గోడను ఢీకొట్టి, అతి వేగంగా వెళ్లి గోడపైకి ఎక్కినట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును క్రేన్ సాయంతో కిందికి దింపారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి జరగకపోవడం ఊపిరి పీల్చేలా చేసింది.
Caste Census : సీఎం రేవంత్ కు కవిత సవాల్
కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువైంది. పోలీసుల కథనం ప్రకారం, డ్రైవర్ తీవ్ర నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. డ్రైవింగ్‌కు ముందు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంత అవసరమో గుర్తుచేసే ఘటనగా దీన్ని పరిగణిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “గోడపైనే కారు ఎక్కించడం ఏంటి?” అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ఫస్ట్ ఫ్లోర్ పార్కింగ్?”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హైదరాబాద్ ఎడిషన్” వంటి కామెంట్స్ పంచుకుంటున్నారు.