Trump – T Shirts Sale : జైలులో దిగిన ఫొటోతో ట్రంప్ ఎన్నికల ప్రచారభేరి
Trump - T Shirts Sale : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు కేసులను ఎదుర్కొంటున్నా.. మరోవైపు తన ప్రచారాన్ని ఆపడం లేదు.
- By Pasha Published Date - 10:57 AM, Fri - 25 August 23

Trump – T Shirts Sale : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు కేసులను ఎదుర్కొంటున్నా.. మరోవైపు తన ప్రచారాన్ని ఆపడం లేదు. ప్రతి కేసునూ తన ప్రచార అస్త్రంగా మలుచుకోవడంపై .. ఆ కేసులను కూడా ఓటర్ల సానుభూతిగా మలుచుకోవడంపై ట్రంప్ ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కోసం ఒక టీ షర్ట్ ను రిలీజ్ చేశారు. ఆ టీ షర్ట్ పై ప్రింట్ చేసిన ట్రంప్ ఫోటో ఎక్కడిదో తెలుసా ? గురువారం (ఆగస్టు 24న) రాత్రి జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు లోపల దిగిన ఫోటో అది !! జైలు లోపల ఖైదీలను తీసే ఫొటోలను మగ్ షాట్ ఫోటోలు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ మగ్ షాట్ ఫోటోనే తన ఎన్నికల ప్రచార టీ షర్ట్ పై ట్రంప్ ప్రింట్ చేయించారు. ఈ ఫొటో కింద ‘నెవర్ సరెండర్’ అనే ట్యాగ్ లైన్ ను రాశారు. ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రభుత్వం వేధింపులకు తాను లొంగబోననే సంకేతాన్ని ఇచ్చేలా ఈ ట్యాగ్ లైన్ ను వాడారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్‌లో మగ్ షాట్ ఫొటోతో కూడిన టీ-షర్ట్ లను (Trump – T Shirts Sale) లిస్ట్ చేశారు. ఒక్కో టీ-షర్ట్ ధరను రూ.2810గా డిసైడ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ అభిమానులు ఆ టీ షర్ట్ లను ఎగబడి మరీ కొంటున్నారు.
Also read : Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. 36 ఏళ్లకే కన్ను మూసిన స్టార్ రెజ్లర్
2020 సంవత్సరంలో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసుల్లో కోర్టు ఆర్డర్స్ ను పాటిస్తూ ఫుల్టన్ కౌంటీ పోలీసుల ఎదుట గురువారం రాత్రి ట్రంప్ సరెండర్ అయ్యారు. అక్కడ ట్రంప్ ను పోలీసులు ఫార్మాల్టీ ప్రకారం అరెస్టు చేసి, జైలులోకి తీసుకెళ్లారు. జైలులో ట్రంప్ 20 నిమిషాలు గడిపారు. ఆ జైలులో ఖైదీగా ఉన్న టైంలో ట్రంప్ కు ‘P01135809’ నంబర్ ను కేటాయించారు. రూ.1.65 కోట్ల పూచీకత్తుపై ట్రంప్ కు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఈవిధంగా జైలులోకి వెళ్లి మగ్ షాట్ దిగాల్సి వచ్చిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.