Chai GPT : చాట్ GPT ని ఛాయ్ GPT చేశారు కదరా.. కొత్త టీ స్టాల్ ChaiGPT..
ఇండియాలో రెస్టారెంట్స్, ఫుడ్ కి సంబంధించిన షాప్స్ కి ఇటీవల కొత్త కొత్త పేర్లు పెట్టడం బాగా అలవాటైంది. ఆ పేర్లని చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయినా ఇదేదో వింతగా ఉందే అని కనీసం ఒక్కసారైనా ఆ రెస్టారెంట్ కి వెళ్తున్నారు.
- By News Desk Published Date - 08:00 PM, Thu - 18 May 23

గత కొన్ని రోజులుగా టెక్నాలజీ(Technology) వరల్డ్ లో బాగా వినిపిస్తున్న పేరు ChatGPT. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ChatGPT ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. చదువుకునే విద్యార్థులు నుంచి చదువు చెప్పే ప్రొఫెసర్స్ వరకు అంతా ఇన్ఫర్మేషన్ కోసం, కొత్తగా రాయడం కోసం, ప్రశ్నలకు సమాధానాల కోసం, కొత్త కోడ్స్, సైట్స్ కి ఇన్ఫోర్మేషన్ రాయాలన్నా ChatGPT ని వాడేస్తున్నారు. ప్రస్తుతానికి దీనివల్ల ఉపయోగాలు ఉన్నా, సమస్యలు ఉన్నా ChatGPT మాత్రం ప్రస్తుత ప్రపంచంలో గత కొన్ని రోజులుగా వైరల్ గా మారింది.
అయితే ఈ పేరు ఇటీవల బాగా వైరల్ అవ్వడంతో ఓ వ్యక్తి ఈ పేరుకు కలిసి వచ్చేలా ఓ టీ స్టాల్ పెట్టాడు. మన ఇండియాలో రెస్టారెంట్స్, ఫుడ్ కి సంబంధించిన షాప్స్ కి ఇటీవల కొత్త కొత్త పేర్లు పెట్టడం బాగా అలవాటైంది. ఆ పేర్లని చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయినా ఇదేదో వింతగా ఉందే అని కనీసం ఒక్కసారైనా ఆ రెస్టారెంట్ కి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీ షాప్ పెట్టిన పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.
హైదరాబాద్ దగ్గర్లో మేడ్చల్ వద్ద ఓ టీ షాప్ యజమాని తన స్టాల్ కి ChaiGPT.. ఛాయ్ GPT అనే పేరు పెట్టుకున్నాడు. దీంతో ఈ పేరు, ఈ టీ స్టాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ టీ స్టాల్ ఇటీవలే ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ టీ షాప్ కి ChaiGPT అని పేరు పెట్టడమే కాక జెన్యూన్లీ ప్యూర్ టీ అని కింద కొటేషన్ కూడా పెట్టుకున్నాడు. ఇక ఈ షాప్ లో టీతో పాటు మిల్క్ షేక్స్, స్నాక్స్, మాక్ టైల్స్ కూడా దొరుకుతాయి. అలాగే దీనికి ఫ్రాంచైజీ కూడా ఇస్తానని ప్రమోట్ చేస్తున్నాడు ఈ ఛాయ్ జిపిటి టీ స్టాల్ యజమాని. ఈ ChaiGPT షాప్ బోర్డు ఫోటోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. మనోళ్ల వాడకం మాములుగా ఉండదు మరి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Silicon valley : we have the best start-up ideas
Indian tea shops : hold my tea pic.twitter.com/1j5WtBHowF
— SwatKat💃 (@swatic12) May 17, 2023