Viral Video : ఫ్రీ గా మద్యం బాటిళ్లు దొరకడంతో పండగ చేసుకున్న జనాలు
లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో సాయం చేసేందుకు వచ్చిన వారంతా బాటిళ్లను తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో
- By Sudheer Published Date - 03:31 PM, Wed - 1 November 23
ఫ్రీగా ఫినాయిల్ దొరికితేనే వదలని జనాలు..ఫ్రీగా మద్యం బాటిళ్లు లభిస్తే వదులుతారా..? అదికూడా ఎన్నికల సమయంలో..అందినకాడికి పట్టుకొని వెళ్లారు. క్షణాల్లో మద్యం బాక్స్ లన్ని ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఈ ఘటన బిహార్ (Bihar’s Gaya district)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళుతున్న ఆ కారు (Car) మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం (Accident) జరగడంతో అక్కడి వారంతా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే అందులో ఉన్న వారు కారును వదిలి పారిపోయారు. అయితే.. లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో సాయం చేసేందుకు వచ్చిన వారంతా బాటిళ్లను తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు.
Read Also : King Nagarjuna: ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది: కింగ్ నాగార్జున
गया जिले के डोभी मे शराब से भरी कार सड़क दुर्घटना के बाद लोगों ने लूटी शराब , डोभी पुलिस ने वाहन में बचे शराब को किया बरामद…#BiharNews #BiharPolice pic.twitter.com/4h1mwsdYbk
— News4Nation (@news4nations) October 31, 2023
Related News
Alcohol: మద్యం ఎక్కువగా సేవిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం తెలిసినా కూడా మద్యం సేవించడం ఆపరు. కొందరు ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే మరి కొందరు మాత్రం నిత్యం ప్రతిరోజు మద్యం సేవిస్తూనే ఉంటారు. మద్యానికి బాగా ఎడిక్ట్ అయినవారు పండుగ,పబ్బం అని తేడా లేకుండా ప్రతిరోజు మందులు తాగాల్సిందే. అయితే మద్యాన్ని అధికంగా సేవించడం అస్సలు మంచిది కాదు అని వైద్యులు ఎంత మొత్తుకున్నా కూడా అసలు వినిపించుకోరు. మ