Warangal : హారన్ కొట్టినందుకు డ్రైవర్ ను చితకబాదారు..
హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు
- By Sudheer Published Date - 02:39 PM, Wed - 26 June 24

మనుషుల్లో రాను రాను మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాదు..చిన్న చిన్న వాటికీ కూడా ఆగ్రహానికి లోనై చితకబాదేస్తున్నారు. ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే కొట్టడం కామన్..కానీ పెద్దగా హారన్ కొట్టాడనే కోపంతో డ్రైవేర్ను చితకబాదిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్.. శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డు వచ్చింది. దీంతో నాగన్న హారన్ కొట్టాడు. అంతే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు హారన్ ఎందుకు కొడుతున్నావంటూ..వచ్చి అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. సదరు వ్యక్తి కొట్టకండి..కొట్టకండి అంటూ వేడుకున్న వదల్లేదు..ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసిన వారంతా హారన్ కొట్టడం కూడా తప్పేనా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హారన్ ఎందుకు కొట్టావంటూ కారు డ్రైవర్ పై దాడి హాన్మకొండ – జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డురావడంతో హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. #TelanganaNews pic.twitter.com/yWSotUYfg1
— Hashtag U (@HashtaguIn) June 26, 2024
Read Also : Jr Doctors Protest : జూడాల డిమాండ్స్ ను నెరవేరుస్తాం అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు