Old Woman : చనిపోయి..మళ్లీ బ్రతికి స్వర్గం ఎలా ఉందో తెలిపిన భామ..నిజమేనా..?
Old Woman : డాక్టర్స్ చికిత్స చేస్తుండగా..ఆమె మరణించింది. ఆ తర్వాత 11 నిమిషాల కు ఆమె తిరిగి బ్రతికింది. ఈ కొన్ని నిమిషాల సమయంలో ఆమెకు కలిగిన ఆశ్చర్యకరమైన అనుభూతిని పంచుకున్నారు
- By Sudheer Published Date - 12:09 PM, Sat - 19 October 24

మాములుగా ఎవరైనా చనిపోతే స్వర్గానికి పోతారని అంత అంటుంటారు..నిజంగా స్వర్గానికి వెళ్తారా అనేది ఎవరికీ తెలియదు..కానీ సినిమాల్లో మాత్రం చనిపోయిన వారు స్వర్గానికి వెళ్లినట్లు..అక్కడ దేవుళ్లను చూసినట్లు..అక్కడి నుండి భూమిని చూస్తున్నట్లు చూపిస్తుంటారు. ఇవి చూసి నిజంగా స్వర్గంలో ఇలాగే ఉంటుందని అంత అనుకుంటుంటారు. తాజాగా ఓ భామ ఇలాంటి విషయాలే చెప్పి షాక్ ఇచ్చింది.
కాన్సాస్ కు చెందిన షార్లెట్ హోమ్స్ (68) అనే మహిళ.. 2019లో అధిక రక్తపోటుకు గురికావడం తో హాస్పటల్ కు తరలించారు. డాక్టర్స్ చికిత్స చేస్తుండగా..ఆమె మరణించింది. ఆ తర్వాత 11 నిమిషాల కు ఆమె తిరిగి బ్రతికింది. ఈ కొన్ని నిమిషాల సమయంలో ఆమెకు కలిగిన ఆశ్చర్యకరమైన అనుభూతిని పంచుకున్నారు. ఆమె తన శరీరం పైన తేలియాడుతున్నట్లు కనిపించిందని , వైద్యుల బృందం ఆమెను తిరిగి బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తుంది చూశానని.. గదిలో గందరగోళం, శబ్దం గురించి ఆమె వివరించింది.
ఈ కొద్ది నిమిషాల్లో ఆమె ప్రయాణం స్వర్గంలోని అందమైన దృశ్యానికి తీసుకెళ్లిందని వెల్లడించింది. ప్రకాశవంతమైన రంగులు, దట్టమైన పచ్చదనం, అందమైన పువ్వులతో అసాధారణమైన అందమైన పరిసరాలను చూసినట్లు ఆమె తెలిపింది. సృష్టి అంతా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా అంతా సంగీతం, ఆనందంతో నిండిపోయిందని వెల్లడించింది. తనకు ముందుగా తన మరణించిన కుటుంబ సభ్యులు కనిపించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె తన కుమారుడిని చూసినట్లు పేర్కొన్నారు. స్వర్గంలో ఆత్మలు పెరుగుతూనే ఉంటాయని దేవుడు తనకు చెప్పాడని ఆమె పేర్కొంది. దీంతో మరణం తర్వాత జీవితం ఉంటుందని ఆమె తన అనుభవాన్ని వెల్లడించింది. మరి ఈమె చెప్పిందాంట్లో నిజమో కాదో ..లేక ఆమెకు ఆలా అనిపించి ఉందేమో అని ఈమె మాటలు విన్న వారు చెప్పుకొచ్చారు. షార్లెట్ హోమ్స్ తన 72వ ఏటలో నవంబర్ 28, 2023 మరణించింది.
Read Also : Hyderabad Chicken Lovers: హైదరాబాద్ లో గలీజ్ చికెన్ దందా చికెన్ ప్రియులకు షాకింగ్ !