Baby Born with Teeth : 32 పళ్లతో పుట్టిన బాబు..సోషల్ మీడియా లో వైరల్
ఇక్కడ ఓ బాబు పుట్టుకతోనే ఒకటి , రెండు కాదు ఏకంగా 32 పళ్లతో జన్మించి ఆశ్చర్యపరిచారు
- Author : Sudheer
Date : 20-07-2024 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా అప్పుడే పుట్టిన బాబు or పాప (Baby Born ) కు నోటిలో పళ్లు (Teeth ) అనేవి ఉండవు..మూడేళ్లు దాటితే కానీ పళ్లు అనేవి మొదలుకావు..కొన్ని సార్లు మాత్రం ఒకటి , రెండు పళ్లతో పిల్లలు పుడుతుంటారు. అయితే ఇక్కడ ఓ బాబు పుట్టుకతోనే ఒకటి , రెండు కాదు ఏకంగా 32 పళ్లతో జన్మించి ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్నీ ఆ తల్లి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 32 పళ్లతో బాబు పుట్టినప్పటికీ బాబు కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..ఇదో ఓ వింత అని డాక్టర్స్ తెలిపినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పుట్టిన దగ్గరి నుండి బాబు విశేషాలను ఆ వీడియో లో తెలిపింది. కానీ తల్లి పాలు ఇచ్చేటప్పుడు మాత్రం తనకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. పొరపాటున ఆ చిన్నారికి ఏదైనా జరిగి.. పన్ను విరిగిపోతే.. దాన్ని లోపలికి మింగేసే అవకాశం ఉంటుందని డాక్టర్స్ తెలిపినట్లు ఆమె పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
డాక్టర్లు మాత్రం చిన్నారికి ఉన్న పళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ నిర్ణయం తీసుకుని ఆ చిన్నారి పళ్లను పీకేసినట్లు సమాచారం. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు షాక్ అవుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు ఒక్కొక్కటిగా పాల పళ్లు వస్తాయి కానీ.. ఈ చిన్నారికి మాత్రం ఒకేసారి తల్లి గర్భంలోనే వచ్చేశాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ చిన్నారి పుట్టుకతోనే గట్టి పదార్థాలు నమిలి తినేయొచ్చు అని కొందరు సరదాగా కామెంట్స్ చేసారు.
Read Also : Sri Reddy : శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చిన కూటమి సర్కార్..పలు సెక్షన్ల తో కేసు నమోదు