Sri Reddy : శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చిన కూటమి సర్కార్..పలు సెక్షన్ల తో కేసు నమోదు
చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
- Author : Sudheer
Date : 20-07-2024 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీ రెడ్డి (Sri Reddy)..సోషల్ మీడియా లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని..కనీసం మా సభ్యత్వం కూడా ఇవ్వడం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి మీడియా చానెల్స్ ను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో చాలామంది తనతో ఎఫైర్లు నడిపించారని చెప్పి పలువురి హీరోల పేర్లు , దర్శకులు , నిర్మాతల పేర్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఈమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..ఆమెను పట్టించుకోవద్దంటూ వారంతా డిసైడ్ కావడమే కాదు పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం తో హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చేసింది. అప్పటి నుండి వైసీపీ కి సపోర్ట్ ఇస్తూ..జగన్ ఫై ఎవరైనా విమర్శలు , ఆరోపణలు చేస్తే వారిపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీ కి దగ్గరైంది. ఇక చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎంతోమందిపై నోరు పారేసుకున్న ఈమె..ఇటీవల కూటమి సర్కార్ అధికారం లోకి రావడం తో కాస్త సైలెంట్ అయ్యింది.
We’re now on WhatsApp. Click to Join.
కానీ కూటమి సైలెంట్ అవ్వదు గా..అధికార మదంతో ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారో..ఎలాంటి దాడులు చేసారో నారా లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్నాడు..ఇక ఇప్పుడు ఒక్కర్ని బయటకు లాగుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ దగ్గరి నుండి మొదలుపెడితే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేల ఫై పలు కేసులు నమోదు చేయగా..తాజాగా శ్రీ రెడ్డి ఫై టీడీపీ నేత రాజు యాదవ్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే ఆమెకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదు అయిన కేసుపై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యింది. ‘కడప, హైదరాబాద్, కర్నూల్‌లో నా మీద కేసులంట.. ఎంజాయ్ టీడీపీ బ్యాచెస్’ అంటూ తనదైన శైలిలో స్పందించారు.
Read Also : Telangana Schools : తెలంగాణ హైస్కూల్ టైమింగ్స్ లో మార్పు