Auto Covered into Car : ముందు ఆటో వెనక కారు.. ఇంత టాలెంటెడ్ ఏంటో..!
ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించినది అంటే ముందు ఆటో (Auto) వెనక కారు కలిగి ఉన్న వీడియో అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు.
- By Ramesh Published Date - 09:02 PM, Mon - 18 September 23
Auto Covered into Car : కాదేది క్రియేటివిటీకి అనర్హం అనేలా కొందరు వారు చేసే పనుల వల్ల వారెవా ఏం టాలెంట్ గురూ అనిపించేస్తారు. అలాంటి వారిలో చాలామంది తాము చేయాలనుకున్న పనులు తమ దగ్గర ఉన్న పనులతో కావు అనుకుంటే అప్పుడే వారి బుర్రకి పని చెప్పి వారి కలలను సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక తెలివైన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించినది అంటే ముందు ఆటో (Auto) వెనక కారు కలిగి ఉన్న వీడియో అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు.
ఆ వీడియో చూస్తే మీకే సీన్ అర్ధమవుతుంది. కారు కొనాలనుకున్న వ్యక్తి తన దగ్గర ఉన్న ఆటోనే కారులా మార్చుకున్నాడు. ఏదో పనికిరాని కారు వెనక భాగాన్ని తన ఆటోకి (Auto) అమర్చి వెనక నుంచి అది కారే అనిపించేలా చేశాడు. అయితే వీడియోలో ఆ కారు కాస్త ముందు కెళ్తే ఆటోగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలామందిని ఎంటర్టైన్ చేస్తుంది. కానీ అతను తన కలను నెరవేర్చుకునేందుకు ఇలా చేశాడని చెప్పొచ్చు.
ఆటో (Auto) ని కారుగా అతను మార్చిన తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సొంత కారు కొనడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అసలు సొంత కారు కొన్నా నలుగురితో నారాయణ అన్నట్టు ఉంటుంది కానీ ఆటోని కారుగా మార్చాడు కాబట్టే అతను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన వీడియోలన్నీ కూడా ఖాళీగా ఉన్న వారు బాగా వైరల్ చేసేస్తారు.
ఆటో నడిపే అతని టాలెంట్ చూసి చాలామంది ఏం టాలెంటెడ్ రాజా నీది అనేస్తున్నారు. సోషల్ మీడియా స్పేస్ లో ఇలాంటి వీడియోలు ఇలా పెట్టగానే అలా వైరల్ అవుతాయి. వెనక నుంచి కారులా ముందుకెళ్తే ఆటోలా కనిపించే ఈ వైరల్ వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా కూడా ఇంత టాలెంట్ ఇండియాలోనే ఉంటుందని అనుకుంటున్నారు.
Also Read: Bigg Boss 7 : ప్రిన్స్ యావర్ ఓవర్ కాన్ ఫిడెంట్ అయ్యాడా..?
Related News
Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూం, వీడియో వైరల్
Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నంద