Ambani Party: అంబానీ ఇంట్లో పార్టీ.. విందుతోపాటు క్యాష్ కూడా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా
- By Nakshatra Published Date - 04:30 PM, Mon - 3 April 23
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా అంబానీ ఇంట్లో నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయినా నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు సైతం హాజరయ్యారు. రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఆ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు..
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతిధుల కోసం ఏర్పాటుచేసిన ఆ విందులో కరెన్సీ నోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆ నోట్లు ఎందుకు పెట్టారు అన్న విషయాన్ని వస్తే.. అంబానీ ఇంట్లో కార్యక్రమానికి హాజరైన అతిధుల కోసం వడ్డించిన ఒక స్వీట్ లో ఒక గిన్నెలో ఆకు వేసి దానిపై ఒక స్వీట్ దాని పక్కనే కరెన్సీ నోట్లను కూడా పెట్టారు. సరిగ్గా గమనిస్తే అవి నిజమైన కలిసినట్లు కాదు. అంతేకాకుండా ఆ స్వీట్ ఐటెం కూడా ఢిల్లీలో బాగా పాపులర్ అయిన దౌలత్ కి చాట్. ఆ రుచికరమైన వంటకం పాత ఢిల్లీ సహా ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాలలో కేవలం శీతాకాలంలో మాత్రమే రెండు నెలలు పాటు లభిస్తుంది.
చిక్కటి పాల నుంచి నలుగుతూ తయారుచేసిన పైన పిస్తా కోవా చక్కెర పొడితో దానిని తయారు చేస్తారు. కాగా ఆ పార్టీలో అతిధుల కోసం ఎన్నో వంటకాలను రెడీ చేయించి నట్లు తెలుస్తోంది. వెండి కంచాల్లో ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాలక్ పన్నీర్, పప్పు,కూర,రోటీ, హల్వా,డిజార్ట్, పాపడ్,లడ్డు వంటి రకరకాల భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.