Delhi: ఢిల్లీ మహిళకు అసాధారణ అనుభవం: డ్రైవర్ అస్వస్థతకు కార్ స్టీరింగ్ బాధ్యతలు తీసుకుని, ప్రజలకు వినమ్ర విజ్ఞప్తి
ఢిల్లీకి చెందిన ఓ మహిళ అనుకోని సందర్భంలో ఉబర్ కారు డ్రైవింగ్ చేయవలిసివచ్చింది. కార్ డ్రైవ్ చేస్తున్న ఓబెర్ డ్రైవర్ మార్గ మధ్యలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో, ఆమె తన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుని తానే డ్రైవ్ చేయాల్సి వచ్చింది.
- By Kode Mohan Sai Published Date - 02:46 PM, Mon - 24 March 25

ఢిల్లీకి చెందిన ఓ మహిళ అనుకోని సందర్భంలో ఉబర్ కారు డ్రైవింగ్ చేయవలిసివచ్చింది. కార్ డ్రైవ్ చేస్తున్న ఓబెర్ డ్రైవర్ మార్గ మధ్యలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో, ఆమె తన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుని తానే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఆమె చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెలో భయం కనిపించలేదు. బదులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించారు. ముఖ్యంగా ఆమె ఒక విలక్షణ సందేశం అందించారు – “అసాధారణ పరిస్థితులకు ఎదురయ్యే సందర్భాల్లో అందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలి.”
ఆ మహిళ తన బిడ్డ, తల్లి మరియు అవ్వతో కలిసి ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్ నుండి ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అస్వస్థతతో మిడ్వేలో వాహనం ఆపాల్సి వచ్చింది. దీంతో ఆమె తానే వాహనం నడపాల్సి వచ్చింది. తన అనుభవాన్ని వివరించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీడియోలో ఆమె మాట్లాడుతూ
“ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీకు డ్రైవింగ్ వస్తే, ఎవరినైనా కాపాడవచ్చు. అందరూ తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి.” ఈ సంఘటన మార్చి 18న జరిగినట్టు ఆమె వీడియో క్యాప్షన్ ద్వారా తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఒకరు కామెంట్ చేస్తూ –
“చెల్లి, మానవత్వం ముందుగా – చాలా బాగుంది!”
మరొకరు –
“అవును నిజమే. ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ తెలిసి ఉండాలి” అంటూ స్పందించారు.
ఆపదలో చాకచక్యంగా వ్యవహరించిన ఆమెకు ఇప్పటికీ ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సంఘటన సాధారణంగా అనిపించినా, అందులోని పాఠం మాత్రం ఎంతో గొప్పది – అనుకోని పరిస్థితులకు ముందే సిద్ధంగా ఉండాలి.