Viral Video: ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. వీడియో మరోసారి వైరల్..!
సరస్సులో ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Gopichand Published Date - 08:24 PM, Sat - 3 December 22

సరస్సులో ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వాస్తవానికి 2021లో యూట్యూబ్‌లో ది సన్ షేర్ చేయగా.. 52 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో మరోసారి ప్రత్యక్షమైంది. ఈ వీడియో క్లిప్‌లో బ్రెజిల్‌లోని ఒక సరస్సులో ఒక వ్యక్తి ఈత కొడుతున్నప్పుడు ఒక మొసలి ఎక్కడి నుంచో వచ్చి అతనిని వెంబడించడం ప్రారంభించినట్లు కనపడుతోంది.
వీడియోలో ఒక వ్యక్తి నదిలో ఈతకొట్టడం మనం గమనించవచ్చు. అయితే అతడిని దూరం నుంచి ఒక మొసలి చూసి అతడి దగ్గరకు వేగంగా దూసుకొస్తుంది. దానిని గమనించిన ఆ వ్యక్తి వేగంగా స్విమ్ చేస్తూ ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంతలో మొసలి అతడి చేతిని పట్టుకొని కరిచేస్తుంది. అయినా కానీ ఆ వ్యక్తి అలాగే ఈత కొట్టుకుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు.
అయితే ఆ వ్యక్తి ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతడి చేయి మొత్తం రక్తంతో తడిసిపోతుంది. తర్వాత మొబైల్ ఎమర్జెన్సీ కేర్ సర్వీస్‌కు కాల్ చేయడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ స్విమ్మర్‌కు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. నెటిజన్లు చాలా ఉత్కంఠగా వీడియో చూస్తున్నారు. ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
O CARA NADANDO NO LAGO DO AMOR E NÃO SABIA QUE TEM JACARÉ LÁ, tomou uma mordida só de leve pq o jacaré foi bonzinho pic.twitter.com/eUtWZy83wp
— eita (@ayr4A) October 23, 2021