Karnataka Minister: బూట్లు తొడిగించుకున్న కర్ణాటక మంత్రి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
కర్ణాటక మంత్రి హెచ్‌సి మహదేవప్ప బూట్లు ధరించడంలో ఓ వ్యక్తి సహాయం పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- By Balu J Published Date - 11:48 AM, Thu - 9 November 23

Karnataka Minister: కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సి మహదేవప్ప బూట్లు ధరించడంలో ఓ వ్యక్తి సహాయం పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల మంత్రి ధార్వాడ్‌లో పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోని సౌకర్యాలు, సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన మహదేవప్ప సప్తాపూర్‌లోని సందర్శించారు. వంటగదిలోకి ప్రవేశించిన తర్వాత, తాను బూట్లు తీసేసి లోపలికి వెళ్లాడు.
అయితే అతను బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు, అతని సిబ్బంది మంత్రిగారి ముందు బూట్లను రెడీగా ఉంచారు. మంత్రి బూట్లు తొడుక్కుంటున్న సమయంలో ఇబ్బంది పడటంతో ఆయన సిబ్బందితో స్వయంగా బూట్లను తొడగించుకోవడం వీడియోలో చూడొచ్చు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మహదేవప్ప ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే సాయం కోరినట్లు స్పష్టం చేశారు.
నంజన్‌గూడు ఉపఎన్నిక సందర్భంగా తనకు సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రవాహం నుంచి తుంటి కీళ్ల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు తలెత్తాయని, ఫలితంగా నొప్పి వంగలేక పోయానని వివరించారు. “నేను నా సిబ్బంది నుండి కేవలం ఆరోగ్య కారణాల వల్ల మాత్రమే సాయం తీసుకున్నా’’ అని చెప్పాడు.
Meet H.C. Mahadevappa, Social Welfare Minister of #Karnataka Congress.
Look at the arrogance of power – he's making police security staff wear his shoes.
His duty is to uplift the deprived, but instead, he's exploiting them even more. This is truly shameful.@INCIndia… pic.twitter.com/j2xP2Xxpn6
— Satya Kumar Y (సత్యకుమార్ యాదవ్) (@satyakumar_y) November 9, 2023
Related News

MLC Kavitha: ధాన్యపు రాశుల తెలంగాణ.. వీడియో చిత్రీకరించిన కవిత
MLC Kavitha: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా తెలంగాణ వరి ధాన్యంతో కళకళాలాడుతున్న విషయం తెలిసిందే. ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువగా వరి సాగవుతోంది తెలంగాణలో. దేశంలోనే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రంగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియోను తీశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా వీడియోను చిత్రీకరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుం�