Viral : భారీ వర్షాలకు రోడ్డు మీదకి వచ్చిన మొసలి..
రత్నగిరి జిల్లాలో రోడ్డు మీదకు వచ్చిన నీటి ప్రవాహంలో ఒక మొసలి వాహనదారుల ముందే రోడ్ ఫై పాకుతూ వెళ్లింది
- By Sudheer Published Date - 11:21 AM, Mon - 1 July 24

గత కొద్దీ రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు నీళ్లలో ఉండాల్సిన భారీ ముసళ్ల రోడ్ల మీదకు వస్తూ ప్రజలను భయబ్రణతులకు గురి చేస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలో రోడ్డు మీదకు వచ్చిన నీటి ప్రవాహంలో ఒక మొసలి వాహనదారుల ముందే రోడ్ ఫై పాకుతూ వెళ్లింది. దీంతో బైకర్లు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. ఓ వ్యక్తి దీనిని తమ ఫోన్ కెమెరా తో షూట్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
భారీ వర్షాలతో దేశ రాజధాని న్యూఢిల్లీ తో పాటు ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ , ఛండీగఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హరిద్వార్ , రిషికేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పలు ఇళ్లు కుప్పకూలాయి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గంగానది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగానది ఉపనది సూకిలో చాలా రోజులు నీళ్లు లేవు. కాని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఆకస్మాత్తుగా ప్రవాహం వచ్చింది. కార్ల పార్కింగ్ స్థలం లోకి కూడా వరదనీరు ప్రవేశించింది. చాలా కార్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇక ఐఎండీ ఢిల్లీలో మంగళవారం వరకు ఆరెంజ్ అలర్ట్, బుధవారం నుంచి శుక్రవారం వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే, వారం మొత్తం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలకు రోడ్డు మీదకి వచ్చిన మొసలి pic.twitter.com/zCbt6HzL8E
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
Read Also : Periods: స్త్రీలు పీరియడ్స్ సమయంలో నొప్పి తట్టుకోలేక పోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?